టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు.ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మహేష్ బాబు వీలైనంత తన కుటుంబంతో గడపడానికి కూడా సమయం కేటాయిస్తూ ఉంటారు.
ఇలా తన కుటుంబంతో కలిసి విదేశాలకు పయనం అవుతూ ఎంతో సంతోషంగా గడిపే మహేష్ బాబు తాజాగా కొత్త సంవత్సరానికి కుటుంబంతో కలిసి దుబాయిలో స్వాగతం పలికారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కొద్దిరోజుల క్రితం మహేష్ బాబు మోకాలు సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే దుబాయ్ లో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలతో పాటు నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.
మహేష్ బాబుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి దుబాయిలోని బుర్జ్ ఖలీపా దగ్గర వీరంతా సందడి చేశారు.
ఇక మహేష్ బాబు వంశీ పైడిపల్లి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మోకాలు సర్జరీ నిమిత్తం కొన్ని రోజుల పాటు మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు.అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుట పడడంతో త్వరలోనే ఈ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నారు.ఈ సినిమా వచ్చే వేసవి సెలవులలో విడుదల కానుంది.