మహానటి సావిత్రి… ఆమె నటిగా మాత్రమే మనకు పరిచయం.సావిత్రి నటించిన సినిమాలు, అనుభవించిన రాజా వైభోగం అలాగే కటిక దారిద్రం ఈ విషయాలన్నీ కూడా జనాలకు తెలిసినవే ఇక ఈ మధ్యకాలంలో మహానటి సినిమా రావడం ద్వారా ప్రతి ఒక్క విషయం కూడా మళ్లి వైరల్ అయింది అది కూడా మనం చూసాం.
కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే సావిత్రి కి రాజకీయాలు అంటే కూడా బాగా ఇష్టం ఉండేది.
అంతే కాదు రాజకీయ నాయకులతో కూడా మంచి పరిచయాలు ఉండేవి.
సావిత్రి క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు ఎంతోమంది ఆమెను కలవడానికి ప్రయత్నం చేసేవారు.సావిత్రి కి కాంగ్రెస్ పార్టీ అంటే, నెహ్రూ గారు అన్నా కూడా ఎంతో అభిమానం ఉండేది.
ఇక ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా మధ్యకాలంలో బాగా వైరల్ గా మారాయి ఆమె నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో దిగిన ఫోటోలు కూడా ఇప్పటికీ ఇంటర్నెట్లో కనిపిస్తూనే ఉంటాయి.
జవహర్లాల్ నెహ్రూ 1964 లో మే 27 వ తారీఖున కన్నుమూశారు.గుండెపోటుతో ఆయన మరణించారు అనే విషయం తెలిసిన సావిత్రి చాలా భావోద్వేగానికి గురయ్యారట.ఆయన చనిపోయినా తర్వాత ఏకంగా వారం రోజులపాటు ఆమె భోజనం కూడా చేయలేదని సావిత్రి కుమార్తె చాముండేశ్వరి ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇక నెహ్రూ గారి జ్ఞాపకార్థం ఆమె తన ఇంటిలో ఎప్పుడు గులాబీలు పెంచేవారట.
అయితే చెన్నైలో ఉన్న వాతావరణానికి అక్కడ గులాబీ పూలు ఎక్కువగా వచ్చేవి కాదట.అందుకని హైదరాబాద్ లోని యూసఫ్ గూడాలో ఉన్నా ఆమె ఇంటి ముందు భాగం ఒక పోర్షన్ అంతా కూడా నెహ్రూ గారి జ్ఞాపకార్థం గులాబీ పూల మొక్కల్ని పెంచి వాటిని చూస్తూ ఎప్పుడూ నెహ్రు గారి గురించి మాట్లాడే వారట సావిత్రి.అంతలా నెహ్రు ని ఆరాధించారట.
అయితే ఈ విషయాలు పెద్దగా ఎవరికి తెలియదు.ఆమె బయోగ్రఫీ సినిమాలో కూడా ఈ విషయం ఎక్కడ రాలేదు.