మధ్యప్రదేశ్ సీఎంకు కరోనా పాజిటివ్..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది.రోజురోజూకు తన పంజా విసురుతూ ఇటు ప్రజలను అటు అధికారులను భయాందోళనలకు గురిచేస్తోంది.

 Madyapradesh Cm Tests Positive For Caronavirus..! ,madhya Pradesh Cm Tested Posi-TeluguStop.com

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి దేశవ్యాప్తంగా రోజుకు వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.సామాన్య ప్రజలే కాదు ఇప్పటి వరకు వివిధ శాఖల్లో పనిచేసే చాలా మంది అధికారులకు కూడా వైరస్ సోకింది.

దీంతో వారు విధులు నిర్వర్తించడానికి కూడా వెనకాడుతున్నారు.తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌(61)కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణగా అయింది.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.తనలో కొవిడ్‌-19 లక్షణాలు కనపడడంతో పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు.

పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలిందని చెప్పారు.ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్‌లో ఉంటున్నట్లు చౌహాన్ హిందీలో ట్వీట్ చేశారు.

అయితే, తనతో కలిసి పనిచేసిన వారందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని శివరాజ్ సింగ్ కోరారు.మధ్యప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కరోనా సోకుతుందని శివరాజ్ సింగ్ చెప్పారు.వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని, కానీ తనను కలవడానికి చాలా మంది వచ్చారని ఈ క్రమంలోనే కరోనా సోకినట్లు ఆయన వివరించారు.

కాగా, శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా రిపోర్టులు శుక్రవారం మధ్యాహ్నం వచ్చాయి.ఆయనను వైద్య సిబ్బంది భోపాల్‌లోని చిరాయు ఆసుపత్రికి తరలించనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ మిశ్రా తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube