యూఏఈలో స్థిరపడిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త , లులూ గ్రూప్ అధినేత ఎంఏ యూసఫ్ అలీ ( MA Yusuf Ali )ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు.ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్‌మెంట్‌కు అడ్డుగా వున్న చట్టాలను ఆయన సరళీకరించారని, తద్వారా ప్రవాస భారతీయుల పెట్టుబడులను దేశీయ ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తున్నారని అలీ తెలిపారు.వచ్చే మూడేళ్లలో భారత్‌లో తాము దాదాపు రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు అలీ చెప్పారు.ఇప్పటికే తమ కంపెనీ భారత్‌లోని పలు ప్రాజెక్ట్‌ల్లో రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని ఆయన వెల్లడించారు.భారతదేశంలో 50,000 మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని, ఇప్పటికే లులూ గ్రూప్ అనుబంధ సంస్థలు 22,000 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాయని యూసఫ్ అలీ చెప్పారు.
తెలంగాణలో డెస్టినేషన్ షాపింగ్ మాల్స్( Destination shopping malls ) (రూ.3000 కోట్లు)తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ వచ్చే ఐదేళ్లలో లులూ గ్రూప్ రూ.3,500 కోట్ల పెట్టుబడులు పడుతుందని అలీ తెలిపారు.దేశంలో షాపింగ్ మాల్స్, హోటళ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సహా వివిధ రంగాల్లో తాము ఇప్పటికే పెట్టుబడి పెట్టగా, దానిని మరింత పెంచుతామని ఆయన పేర్కొన్నారు.అహ్మదాబాద్‌లో( Ahmedabad ) షాపింగ్ మాల్ నిర్మాణాన్ని ప్రారంభించామని, అలాగే చెన్నైలో మరొకటి , నోయిడాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, తెలంగాణలో మరొకటి రాబోతోందన్నారు.
కేరళలో జన్మించిన అలీ.అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న లులూ గ్రూప్‌కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.ఈ గ్రూప్ వివిధ దేశాల్లో హైపర్ మార్కెట్లు నిర్వహిస్తోంది.మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, భారత్, మలేషియా, ఇండోనేషియాలో ఉన్న 220కి పైగా హైపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ద్వారా 57వేల మంది ఉపాధి పొందుతున్నారు.
మధ్యప్రాచ్యంలో అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా 2021లో యూసుఫ్‌అలీ స్థానం సంపాదించారు.ఇదే సమయంలో గల్ఫ్‌లోని అన్ని దేశాల అధినేతలతో సన్నిహిత సంబంధం వుండటంతో మధ్యప్రాచ్యంలో అత్యంత ప్రభావవంతమైన భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు.
వ్యాపారంలో రాణిస్తూనే.సమాజానికి ఎంతో కొంత సాయం చేస్తున్నారు.