టీడీపీ నేత నారా లోకేశ్ పై మాజీమంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మేనమామ కొడుకు చనిపోతే లోకేశ్ పాదయాత్ర ఆగలేదన్న ఆయన ఆస్పత్రికి వెళ్లి చనిపోయిన వారిని చూసే మనసు కూడా లేదని విమర్శించారు.
కానీ చంద్రబాబును అరెస్ట్ చేస్తే మాత్రం లోకేశ్ పాదయాత్ర ఆపారని పేర్ని నాని పేర్కొన్నారు.లోకేశ్ చేపట్టింది మొక్కుబడి యాత్ర అని, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే యాత్ర చేపట్టారని విమర్శించారు.
ఈ క్రమంలోనే లోకేశ్ ది బ్లాక్ బస్టర్ సినిమా కాదన్న ఆయన అట్టర్ ప్లాప్ సినిమా అంటూ ఎద్దేవా చేశారు.సినిమా ఫంక్షన్, యువగళం – నవశకం సభకు తేడా కనిపించలేదన్నారు.
డబ్బుతో యువగళంలో జనాన్ని పోగేశారని విమర్శించారు.లోకేశ్ యువగళం జంపింగ్ జపాంగ్ యాత్ర అన్న పేర్ని నాని పాదయాత్ర కిలోమీటర్లన్నీ దొంగ లెక్కలేనని వెల్లడించారు.