Like share and subscribe movie review : లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రివ్యూ: కొత్త కథనే కానీ చూడటం కష్టమే!

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన మూవీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.ఈ సినిమాకు డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు.

 Like Share And Subscribe Movie Review And Rating Details Here Like Share And Sub-TeluguStop.com

కామెడీ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, సుదర్శన్, నరేన్, మైమ్ గోపి, గోవింద్ పద్మసూర్య, సప్తగిరి, బబ్లూ, మిర్చి కిరణ్, ఫణి తదితరులు నటించారు.నిహారిక ఎంటర్టైన్మెంట్స్, అమృత క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాకు వెంకట్ బోయినపల్లి నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.

ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతాన్ని అందించారు.ఏ.వసంత్ సినిమాటోగ్రఫీ అందించాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూసాం.

కథ:

ఇంతకీ కథ ఏంటంటే.1990 ఫ్లాష్ బ్యాక్ సీన్ తో సినిమా ప్రారంభమవుతుంది.ఇక నక్సలిజంకి సంబంధించిన కథ నడుస్తుంది.

ఇందులో సంతోష్ శోభన్ తన స్నేహితుడైన కెమెరామెన్ నెల్లూరు సుదర్శన్ తో కలిసి పలు అందమైన ప్రదేశాలకు వెళ్తాడు.ఈ భాగంలో నక్సల్స్ ఉండే ప్రాంతానికే ట్రావెల్ వీడియోలు చేయడానికి వెళ్తాడు.

ఇక ఆ ప్రదేశాలకు ప్రయాణించి ట్రావెల్ బ్లాగర్ గా మారాలని అనుకుంటాడు.దీంతో అదే సమయంలో అతడికి ఫరియా అబ్దుల్లా ఎదురవుతుంది.

ఇక ఆమెను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.ఆమెను కూడా తన ప్రేమలో పడేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు.

కానీ అంతలోన అతడికి అనుకోకుండా ఒక సంఘటన ఎదురవుతుంది.దీంతో ఆ సంఘటన ఏంటి.

చివరికి ఫరియా అబ్దుల్లాను తన ప్రేమలో పడేస్తాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Telugu Brahmaji, Faria Abdullah, Share Subscribe, Maim Gopi, Naren, Review Story

నటినటుల నటన:

నటీనటుల నటన విషయానికొస్తే.సంతోష్ తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు.తన వేరియేషన్స్ అద్భుతంగా చూపించాడు.

ఇక ఫరియా అబ్దుల్లా గ్లామర్ మాత్రం అద్భుతంగా ఉంది.తన నటనతో మార్కులు సంపాదించుకుంది.

మిగిలిన నటీనటులంత తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Telugu Brahmaji, Faria Abdullah, Share Subscribe, Maim Gopi, Naren, Review Story

టెక్నికల్:

ఇక డైరెక్టర్ ఈ సినిమాకు మంచి కథను అందించే ప్రయత్నం చేశాడు.కానీ ఎందుకో అంతగా సక్సెస్ కాలేకపోయాడు.ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది.

వసంత్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు.ఇక మిగిలిన సాంకేతిక విభాగాలు బాగానే పని చేశాయి.

Telugu Brahmaji, Faria Abdullah, Share Subscribe, Maim Gopi, Naren, Review Story

విశ్లేషణ:

ఇక సినిమా ఏంటంటే హీరో యూట్యూబ్ ఛానల్ ని పాపులర్ చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటారు.ఇక ఫస్ట్ హాఫ్ కాస్త బోరింగ్ గా సాగింది.సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ వర్కౌట్ కాలేదు.

ప్లస్ పాయింట్స్

: నటీనటుల నటన, సాంగ్స్, కొన్ని సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

కథ అంతగా ఆకట్టుకునే విధంగా లేదు.కామెడీలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే.ఈ సినిమా హీరో ట్రావెల్ జర్నీ, నక్సలెస్ సన్నివేశాలు పార్లర్ గా సాగినట్లు అనిపిస్తుంది.ఈ సినిమాను ఒకసారి చూస్తే పరవాలేదన్నట్లుగా అనిపిస్తుంది.

రేటింగ్: 2.0/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube