భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టనున్న ప్రముఖ ఎన్నారై...!!

లులు గ్రౌప్స్ అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారు ఉండరు.ప్రపంచ దేశాలలో భారీ పెట్టుబడులు పెడుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరిస్తూ ప్రస్తుతం భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు ప్రముఖ పారిశ్రామిక వేత్త, కేరళ కు చెందిన ఏం ఏ యూసఫ్ అలీ.

 Leading Nris To Make Huge Investments In India , India , Yusuf Ali, Head Of The-TeluguStop.com

యూఏఈ లో ఎన్నో ఏళ్ళ క్రితమే స్థిరపడి చిన్న వ్యాపార స్థాయి నుంచే నేడు ప్రపంచ దిగ్గజ వ్యాపార వేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.ప్రస్తుతం భారత్ లోని గుజరాత్ లో భారీ పెట్టబడులు పెట్టేందుకు యూసఫ్ అలీ సిద్దమయ్యారు.

గుజరాత్ లో సుమారు రూ.2 వేల కోట్ల పెట్టుబడితో మాడ్రన్ షాపింగ్ మాల్ తెరిచేందుకు సిద్దమయ్యారు.యూసఫ్ అలీ పెట్టనున్న ఈ పెట్టుబడుల ద్వారా గుజరాత్ లో సుమారు 5 వేల మందికి ఉపాధి దొరకనుంది.ఈ భారీ ప్రాజెక్ట్ పై ఇప్పటికే యూసఫ్ అలీ, గుజరాత్ ప్రభుత్వం తరుపున అడిషనల్ చీఫ్ సెక్రెటరీ రాజీవ్ గుప్తా సంతకాలు చేశారు.

అహ్మదాబాద్, గాంధీ నగర్ మధ్యలో ప్రపంచ స్థాయి షాపింగ్ మాల్ ను నిర్మించనుంది ఈ నిర్మాణాన్ని 2022 లో ప్రారంభించిన నాటి మొదలు 30 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Telugu Gujarat, Lulu, India, Nris India, Modern Mall, Yusuf Ali-Telugu NRI

ఇదిలా ఉంటే లులు గ్రూప్ అధినేత యూసఫ్ అలీ ఈ పెట్టుబడులపై మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళ నుంచీ గుజరాత్ లో పెట్టుబడులు పెట్టాలని అనుకున్నాను కానీ ఇన్నాళ్ళు నాకు అవకాశం వచ్చింది.తన తండ్రి గుజరాత్ లో మొదట వ్యాపారం చేశారు, తాను కూడా ఇక్కడే వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాను అంటూ అలీ ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో షాపింగ్ మాల్స్ ఉన్నా భారత్ లో పెట్టుబడులు పెట్టడం అది కూడా తనకు ఎంతో ఇష్టమైన గుజరాత్ లో పెట్టుబడులు పెట్టి ఎంతో మందికి ఉపాది కల్పించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని యూసఫ్ అలీ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube