తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.దీనిపై శాసనసభలో చర్చలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్ రావు మాట్లాడుతూ లెక్కలు ప్రభుత్వానికి అనుకూలంగా రూపొందించుకున్నారన్నారు.బీఆర్ఎస్ పాలనలో కరోనాతో పాటు కేంద్ర ప్రభుత్వ వివక్ష ఉన్నా ఏనాడూ సంక్షేమం, అభివృద్ధి పథకాలను ఆపలేదని తెలిపారు.
రూ.లక్ష కోట్లకు పైగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని చెప్పారు.ఆర్థిక శ్వేతపత్రం అంకెల గారడీ, తప్పుల తడకగా ఉందని పేర్కొన్నారు.కుట్రపూరితంగా దివాళా అని ప్రచారం చేస్తే పెట్టుబడులు రాకుండా పోతాయన్న హరీశ్ రావు ఇది తెలంగాణ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టని తెలిపారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడం కోసమే ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారనే అనుమానం కలుగుతోందని వెల్లడించారు.