తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు.అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు( Kota Srinivas Rao ), బాబు మోహన్ లా కాంబో చాలా బాగా వర్క్ అవుట్ అయింది.
ప్రతి సినిమాలో కూడా వీళ్ళిద్దరూ ఉండాలని మరి డైరెక్టర్లు వాళ్ళకి కొన్ని సీన్లు రాసేవారు.ఇక వాళ్ళు వాళ్ల కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా అలరించేవారు.
అలా వీళ్ళ కాంబినేషన్ కి మంచి పేరైతే వచ్చింది.అప్పట్లో ప్రతి సినిమాలో కూడా ప్రత్యేకించి వీళ్ళ కోసం ఒక ట్రాక్ అనేది రాసుకునేవాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తారో అప్పుడు జనం థియేటర్లో సందడి చేసేవారు.

వీళ్ళ కాంబినేషన్ అనేది ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన మామగారు ( Mamagaru )అనే సినిమాతో మొదలైంది.ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు పని పాట లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుని తిరిగే క్యారెక్టర్ కావడంతో బాబు మోహన్ ది ముష్టి వాడి క్యారెక్టర్ దాంతో వీళ్ళిద్దరూ కలిసి ఇంటి అరుగు మీద కూర్చుని ముచ్చట్లు పెట్టుకునే సీన్లు కానీ బాబు మోహన్ ( Babu Mohan )కోట శ్రీనివాసరావు పైన వేసే సెటైరికల్ పంచులు గాని అప్పటి జనాలని విపరీతంగా ఎంటర్టైన్ చేశాయి.

దాంతో వీళ్ళ కాంబినేషన్ కు ఎక్కడలేని క్రేజ్ అనేది ఏర్పడింది ఇక అప్పటినుంచి వీళ్లు తెలుగులో వచ్చిన ప్రతి సినిమాల్లో నటిస్తూ జనాలని మెప్పిస్తు వస్తున్నారు.ఇక ఇప్పుడు బాబు మోహన్ బిజెపి పార్టీలో ( BJP )మెంబర్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే.అలాగే కోట శ్రీనివాసరావు వృద్ధాప్యం మీద పడటం తో ఆయన సినిమాలు చేయకుండా ఖాళీగానే ఇంట్లో ఉంటున్నారు.వీళ్ళిద్దరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన మంచి నటులనే చెప్పాలి…ఇప్పుడు అలాంటి మంచి నటులు ఇండస్ట్రీ లో కరువయ్యారు…
.