టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకడు కొరటాల శివ.ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
తాజాగా మెగా స్టార్ చిరంజీవితో కలిసి ఆయన చేపట్టిన ప్రాజెక్టు ఆచార్య.సినిమా కంప్లీట్ అయినా.
విడుదలకు నోచుకోవడం లేదు ఆచార్య.ఆయనకు తలనొప్పిగా మారింది ఈ చిత్రం.ఈ సినిమా విడుదల అయితే మిగతా ప్రాజెక్టులు చేపట్టవచ్చనుకుంటున్నాడు.అయితే తనకు అస్సలు టైం కలిసి రావడంలేదు.కొరటాల తెరకెక్కించిన చివరి సినిమా భరత్ అనే నేను.ఈ సినిమా 2018లో విడుదల అయ్యింది.ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.మంచి వసూళ్లను కూడా అందుకుంది.ఆ సినిమా జోష్ తో చిరంజీవితో ఆచార్య సినిమాను ప్రకటించాడు.అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికే చాలా సమయం పట్టింది.
చిరంజీవి హీరో కావడంతో ఏమీ అనలేక.సహనంగా వెయిట్ చేశాడు.
చివరకు చిరు షూటింగ్ కు ఓకే చెప్పాడు.దీంతో కరోనా వచ్చింది.
దాదాపు ఏడాది సమయం వేస్ట్ అయ్యింది.అదే సమయంలో కొంత షూటింగ్ అయ్యాక చిరంజీవి కరోనా బారిన పడ్డాడు.
దీంతో మళ్లీ షూటింగ్ వాయిదా పడింది.ఆ తర్వాత కరోనా సెకెండ్ వేవ్ మొదలయ్యింది.
మళ్లీ తలనొప్పులు మొదలయ్యాయి.
ఎలాగోలా సినిమా షూటింగ్ పూర్తి చేశారు.
ఆ తర్వాత కొన్ని సీన్లను రీషూట్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి.ఇక ఆచార్య విడుదల తేదీలు చాలా సార్లు ప్రకటించారు.
ప్రతిసారి ఏదో కారణంతో వాయిదా వేశారు.ఈ సినిమా ఫిబ్రవరి 4న జనాల ముందుకు తీసుకువస్తున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది.
అయితే ప్రస్తుతం ఆ డేట్ ను ఏప్రిల్ 1కి మార్చారు.అదే రోజు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట అనే సినిమా కూడా విడుదల కావాల్సిఉంది.
అదే రోజున ఈ సినిమాను విడుదల చేస్తారా? లేదంటే మళ్లీ వాయిదా వేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
అటు కొరటాల ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలి.ఆచార్య సినిమా విడుదల అయ్యాక.
ఈ సినిమా పనులు చూసుకుందాం అనుకుంటున్నాడు కొరటాల.అయితే ఆయనకు ఆచార్య కష్టాలు ఇప్పటికీ తప్పడం లేదు.