మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ వంటి అందాల పోటీలలో భారతీయ యువతులు రాణిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా యూకేకు చెందిన ఖుషీ పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేతగా నిలిచారు.
శుక్రవారం రాత్రి జరిగిన తుదిపోరులో అమెరికాకు చెందిన వైదేహి డోంగ్రే మొదటి రన్నరప్‌గా నిలవగా.శ్రుతికా మానే సెకండ్ రన్నరప్‌గా ఎంపికయ్యారు.
ఈ పోటీలలో టాప్ 12 కంటెస్టెంట్లు.ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన అందాల పోటీలలో విజేతలుగా నిలిచిన వారే కావడం విశేషం.
ఇక ఖుషీ పటేల్ విషయానికి వస్తే.ఆమె బయో మెడికల్ సైన్సెస్‌లో మేజర్‌గా, సైకాలజీలో మైనర్‌గా వున్నారు.మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 పోటీలలో విజేతగా నిలవడం సంతోషంగా వుందని ఖుషీ పటేల్ అన్నారు.ఇప్పటికే బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్న ఆమె మోడల్‌గా కూడా రాణిస్తున్నారు.
రానున్న రోజుల్లో మూడవ ప్రపంచ దేశాలకు సాయం చేయాలని ఖుషీ పటల్ భావిస్తున్నారు.
కాగా.గయానాకు చెందిన రోషని రజాక్ మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2022గా ఎంపికైంది.అమెరికాకు చెందిన నవ్య పైంగోల్ తొలి రన్నరప్‌గా నిలవగా.
సురినామ్‌కు చెందిన చికితా మలాహా సెకండ్ రన్నరప్‌గా గెలిచారు.ఈ మేరకు ఇండియా ఫెస్టివల్ కమిటీ (ఐఎఫ్‌సీ) ప్రకటించింది.
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను గడిచిన 29 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.కరోనా, లాక్‌డౌన్, అంతర్జాతీయంగా ఆంక్షల కారణంగా దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
చివరిసారిగా 2019లో ముంబైలోని లీలా హోటల్‌లో ఈ అందాల పోటీలు నిర్వహించారు.కోవిడ్ మహమ్మారి.
మనం ఆలోచించే, జీవించే విధానాన్ని మార్చేసిందని ఐఎఫ్‌సీ ఛైర్మన్ ధర్మాత్మ శరణ్ అన్నారు.