మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా( Khaleja movie ) సినిమా నేటికీ కూడా టీవీల్లో ఎప్పుడు చూస్తూనే ఉంటాం.థియేటర్ లో ఇది ప్లాప్ అయినప్పట్టికి ఇది ఒక మంచి సినిమాగానే జనాలు చూస్తూ ఉంటారు.
చిత్రంలో కామెడీ, త్రివిక్రమ్ డైలాగ్స్ అన్ని కూడా ఎంతో బాగుంటాయి.కానీ ఒక రొమాంటిక్ హీరో ని దేవుడు అంటే జనాలు ఒప్పుకోక ఈ సినిమాను ప్లాప్ చేశారు.
అయితే ఖలేజా సినిమా టైటిల్ విషయంలో చాల పెద్ద హై డ్రామా సాగింది.అది ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు కానీ పదమూడేళ్ళ వెనక్కి వెళితే ఖలేజా సినిమా పేరు పెట్టుకొని త్రివిక్రమ్ ఈ చిత్రం వర్క్ ప్రారంభించి, సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి జనాల్లోకి కూడా ఈ సినిమాను తీసుకెళ్లడం మొదలు పెట్టారు.
కానీ సినిమా విడుదల కు ఒక మూడు, నాలుగు రోజుల ముందు విజయ భాస్కర్ రెడ్డి అనే ఒక నిర్మాత ఆ సినిమా టైటిల్ నాది, నేను ఇదివరకే ఈ పేరును రిజిస్టర్ చేయించాను అంటూ కోర్ట్ కి ఎక్కాడు.వాస్తవానికి సదరు నిర్మాత నిజంగానే ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయించుకున్నాడు.కానీ ఆ పేరుతో ఎలాంటి సినిమా తీయలేదు.ఈ విషయం తెలియక త్రివిక్రమ్( Trivikram ) మూడు అక్షరం సినిమా పేర్లు మహేష్ కి చాల సెంటిమెంట్ కాబట్టి ఆ పేరును ఫిక్స్ చేసుకొని రిలీజ్ కి అంత సిద్ధం చేసుకున్నాడు.
ఈ కేసు కోర్టు లో వాదనకు వచ్చింది.రిజిస్టర్ చేయించుకున్న విషయం వాస్తవమే కాబట్టి సినిమా యూనిట్ నష్టపరిహారం చెల్లిస్తారు ఎంత కావాలి అంటూ జడ్జ్ విజయ భాస్కర్ రెడ్డి( Vijaya Bhaskar Reddy ) ని అడగగా, మొదట పది లక్షలు డిమాండ్ చేసాడు.
దానికి నిర్మాత కూడా ఒకే అన్నాడు.
అంతలో మద్యాహ్నం లంచ్ కి టైం అయ్యింది తదుపరి విచారణ లంచ్ తర్వాత అని చెప్పడం తో అందరు వెయిట్ చేస్తున్నారు.ఆ లోపే జడ్జ్ తనకు పేవర్ గా ఉన్న విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని సదరు వ్యక్తి 25 లక్షల డిమాండ్ చేయడం తో జడ్జ్ నోరెళ్లబెట్టాడు.పైగా రెండు రోజుల్లో సినిమా విడుదల ఉండగా ఇంత అత్యాశకు పోతావా అంటూ కేసును ఆధారాలను పరిశీలించడానికి టైం కావాలని, ఇప్పుడు ఆ చిత్రం విడుదల ఆపడం కుదరదు అని కేసును డిస్మిస్ చేసారు.
ఇలా అత్యాశకు పోయినందుకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఆ నిర్మాతకు.పైగా కోర్ట్ ఖర్చులు అదనం.