తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.ఇందులో భాగంగా డీహెచ్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
అయితే కేసీఆర్ అవకాశం ఇస్తే బీఆర్ఎస్ తరపున కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని శ్రీనివాసరావు మాట్లాడిన సంగతి తెలిసిందే.ప్రభుత్వ అధికారిగా ఉంటూ పార్టీ తరపున మాట్లాడుతున్నారని ఆరోపించింది.
ఈ క్రమంలో శ్రీనివాసరావును వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.