మాములుగా ఏ హీరోయిన్ అయినా వరుస ఆఫర్స్ వస్తున్న క్రమంలో చెల్లెలి పాత్రలలో నటించడానికి నో చెబుతారు.ఎందుకంటే హీరోయిన్ గా చేస్తే హీరోయిన్ పాత్రలే వస్తాయి.
ఐటెం సాంగ్స్ చేస్తే ఐటెం సాంగ్స్ లోనే అవకాశాలు వరిస్తాయి.ఇక సిస్టర్ క్యారెక్టర్స్ చేస్తే అలాంటి అవకాశాలే వస్తాయని భయపడుతూ ఉంటారు.
కానీ కీర్తి మాత్రం వీటికి వ్యక్తిరేకంగా ఉంది.
ఒక్కసారి సిస్టర్ పాత్రలో కనిపిస్తే అలాంటి పాత్రలు రావడమే కాకుండా హీరోయిన్ గా వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
జనరల్ గా హీరోయిన్ లు ఎవరైనా ఫామ్ కోల్పోయినప్పుడు ఇలాంటి పాత్రలను అంగీకరిస్తారు.కానీ కీర్తి సురేష్ మాత్రం హీరోయిన్ గా అవకాశాలు వారిస్తున్న సమయంలోనే ఇలాంటి చెల్లెలి పాత్రల్లో కూడా ఒప్పుకుంటూ వాటిని పూర్తి చేస్తుంది.
ఈమె ఒక వైపు హీరోయిన్ గా స్టార్ ల సరసన మెరుస్తూనే మరోపక్క చెల్లెలి పాత్రల్లో నటిస్తూ సాహసాలు చేస్తుంది.ఇటీవలే ఈ అమ్మడు పెద్దన్న పాత్రలో రజనీకాంత్ సోదరిగా నటించింది.ఇక ఇప్పుడు భోళా శంకర్ లో చిరంజీవి కి జోడీగా కనిపించనుంది.మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు కు చెల్లెలి పాత్రలో కీర్తి నటిస్తున్నట్టు ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.
తాజాగా కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట రిలీజ్ అయ్యింది.మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.ఈ క్రమంలోనే ఈమె వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంది.ఇందులో భాగంగా కీర్తి ఇలా ఎందుకు చేస్తుంది అని అడుగగా ఈమె అందుకు సమాధానం చెప్పుకొచ్చింది.భవిష్యత్తులో ఎలాంటి పత్రాలు వస్తాయో అలోచించి ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలు వదులుకోవడం నాకు ఇష్టం లేదు.ఆ కారణం వల్లనే నేను చెల్లెలు పాత్రల్లో కూడా చేస్తున్నాను.
పాత్రకు చక్కటి ప్రాధాన్యం ఉండడంతో ఈ సినిమాల్లో ఆఫర్ రాగానే ఒప్పుకున్నా అంటూ చెప్పుకొచ్చింది.