రాజమౌళికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కీరవాణి.. మ్యాటరేంటంటే..?

దర్శకధీరుడు గా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు రాజమౌళి( Director Rajamouli )…ఆయన చేసిన మొదటి సినిమా నుంచి ఇప్పుడు చేస్తున్న సినిమా వరకు ఆయన అన్ని సినిమాలకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.నిజానికి రాజమౌళి ప్రతి సినిమాలో కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే రాజమౌళికి అంత పెద్దగా నాలెడ్జ్ లేదట.

 Keeravani Kept His Promise To Rajamouli ,keeravani,rajamouli,rrr,baahubali,music-TeluguStop.com

ఆయన చేసే ప్రతి సినిమాకి కీరవాణిని తీసుకుంటే ఇక మ్యూజిక్ సంబంధించిన అన్ని పనులు ఆయన చూసుకుంటాడనే ఉద్దేశ్యం తోనే ఆయన్ని పెట్టుకుంటానని రాజమౌళి ఒక సందర్భంలో తెలియజేశాడు.

ఇక మొత్తానికైతే వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తూనే వచ్చాయి.ఇక అందులో భాగంగానే బాహుబలి సినిమా( Baahubali ) కోసం రాజమౌళి కీరవాణితో మాట్లాడినప్పుడు ఇది మనం పాన్ ఇండియా లెవెల్ లో చేయబోతున్నాం కాబట్టి దీనికి మ్యూజిక్ మాత్రం చాలా బాగుండాలి పెద్దన్న అని చెప్పాడట.దానికి కీరవాణి( Keeravani ) రాజమౌళి కి మాటిస్తూ ఇందులో ప్రతి ఒక్క సాంగ్ ఒక్కో వేరియేషన్ లో ఇస్తా తప్పకుండా ఈ సినిమా మ్యూజికల్ గా సూపర్ సక్సెస్ అవుతుందని మాటిచ్చాడంట.

 Keeravani Kept His Promise To Rajamouli ,Keeravani,Rajamouli,RRR,Baahubali,Music-TeluguStop.com

ఇక తను మాటిచ్చినట్టుగానే అద్భుతమైన మ్యూజిక్ ని అందించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక త్రిబుల్ ఆర్ సినిమా( RRR Movie )తో ఏకంగా ఆస్కార్ అవార్డుని కూడా అందుకున్న కీరవాణి ఫ్యూచర్ లో మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు.ఇక ముఖ్యంగా ఆయన ఎంతమందితో సినిమా చేసిన కూడా రాజమౌళి సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ మాత్రం చాలా హైలెట్ గా ఉంటుంది…అందుకే రాజమౌళి కీరవాణి కాంభినేషన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube