కీలకంగా మారిన కేటీఆర్ ! కేసీఆర్ ప్లాన్ ఇదా ?

టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు సుప్రీం ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే.పార్టీలోను, ప్రభుత్వం లోనూ ఏ నిర్ణయం తీసుకోవాలన్న, ఏ వ్యూహం అమలు చేయాలన్న అది కేసీఆర్ కు మాత్రమే సాధ్యం అన్నట్లుగా పరిస్థితి ఉండేది.

 Kcr Is Increasing The Importance Of Ktr In The Party And In The Government Kcr,-TeluguStop.com

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారినట్లుగా కనిపిస్తోంది.ఇప్పుడు పార్టీకి సంబంధించినంత వరకు కీలక నిర్ణయాలు అన్నీ , ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మంత్రి కేటీఆర్ తీసుకుంటున్నారు.

అధికారులతోనూ పార్టీ నాయకులతోనూ ఆయన కీలకమైన సమీక్షలు చేపడుతున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారించడంతో,  తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలపై కెసిఆర్ స్థానంలో కేటీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం , తమకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ కాంగ్రెస్ ల పైన విమర్శలు చేయడంలో కేటీఆర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

    ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మేరకు పార్టీ ప్లీనరీ హైటెక్స్ లో నిర్వహించబోతున్నారు.దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలను కేటీఆర్ చక్క బెడుతున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , కీలక నాయకులకు ఇప్పటికే విభాగాల వారీగా బాధ్యతలను అప్పగించారు.ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు కేటీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటి నుంచే వ్యూహరచన జరుగుతోంది.

నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులను గుర్తించి వారికి కీలక బాధ్యతలను అప్పగించే ప్రక్రియలో కేసీఆర్ అన్ని వ్యవహారాలను పెడుతున్నారు.   

Telugu Congress, Kcr National, Telangana, Trs Plinary-Political

  కెసిఆర్ జాతీయ రాజకీయాలను చక్కపెడుతుండగా,  కేటీఆర్ తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ , పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ కీలకంగా మారారు.  అయితే ఇదంతా కేసీఆర్ ముందు చూపు కారణంగానే చోటుచేసుకుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  వాస్తవంగా ఎప్పుడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నా.

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేశారు.కానీ ఎన్నికలలో టిఆర్ఎస్ విజయం సాధిస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట అందుకే ఇప్పటి నుంచే పార్టీలోనూ , ప్రభుత్వంలోనూ, ప్రజల్లోనూ కీలకమైన నాయకుడుగా కేటీఆర్ ను తీర్చిదిద్దేందుకు కేసీఆర్ దృష్టి పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  మరో రెండు రోజుల్లో జరగబోయే పార్టీ ప్లీనరీలో కేటీఆర్ ప్రాధాన్యం మరింత పెంచే విధంగా కేసీఆర్ వ్యవహరించబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube