వంటలక్క అత్తనా.. మజాకానా..!!

స్టార్ మా లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఆ సీరియల్ లో నటించిన అందరికి ఒక గుర్తింపు వచ్చింది.

 Karthika Deepam Serial Fame Archanan Ananth Real Life News, Archanan Ananth Real-TeluguStop.com

ముఖ్యంగా ఆ సీరియల్ ద్వారా దీప బాగా ఫేమస్ అయిపోయింది.ఆ తరువాత డాక్టర్ బాబుగా నిరుపమ్ కూడా బాగానే ఫేమస్ అయ్యాడు.

నిరుపమ్ ఈ సీరియల్ కంటే ముందే మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.అలాగే ఈ సీరియల్ ద్వారా బాగా పేరు తెచ్చుకున్న నటి అర్చన అనంత్.

ఏంటి ఈ పేరు ఎక్కడా సీరియల్ లో అసలు విన్నట్లు అనిపించడం లేదు కదా.ఆవిడ మరెవరో కాదండి.కార్తీకదీపం సీరియల్ లో దీప అత్త క్యారెక్టర్ చేసిన సౌందర్య.తెలుగు రాష్ట్రాల్లో దీపకు ఎంత ఆదరణ ఉందో, సౌందర్య పాత్రకు కూడా అంతే ఆదరణ ఉంది.ఈ పాత్ర ఎంత హుందాగా ఉంటుందో చెప్పక్కర్లేదు.ఒక అత్తగారి పాత్రలో నటిస్తూ, కోడలి వెన్నంటే ఉంటూ కొడుకు కాపురాన్ని చక్కదిద్దాలని చూస్తూ ఉంటుంది.

చక్కని ఆహర్యంతో, మంచి చీరకట్టుతో అందరిని ఆకట్టుకుంటోంది.

ఈ పాత్రలో ఒక పవర్ ఫుల్ లేడిగా చేస్తోన్న సౌందర్య అసలు పేరు అర్చన అనంత్.

అర్చన ప్రస్తుతం కార్తీక దీపంతో పాటు స్టార్ మా మరో సీరియల్ లో ప్రసారమయ్యే ‘కేరాఫ్‌ అనసూయ’ అనే సీరియల్ లో కూడా చేస్తోంది.ఇందులో కూడా పవర్ ‌ఫుల్‌ పాత్ర పోషిస్తోంది అర్చన అనంత్.

‌ అర్చన గురించి చాలామందికి తెలియదు.అయితే ఇటీవల అర్చన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.తాను డాక్టర్‌ కాబోయి.

యాక్టర్‌ అయ్యానని.చెప్పుకొచ్చింది.

Telugu Anasuya Serial, Archanan Ananth, Deepa, Babu, Karthikadeepam, Maa-Latest

ఆ తరువాత ‘‘ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేస్తున్నవేళ, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్‌ కోసం ఆడిషన్‌ ఇవ్వమని కోరగా.సరే, అడిగారు కదా అని వెళ్లి ఆడిషన్‌లో పాల్గొన్నాను.అలా సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది.అయితే నా తొలి పాత్ర గురించి చెప్తే షాక్ అవుతారు.నేను నటించిన తొలి పాత్ర ఏంటంటే ఓ శవంలా పడుకోవడం.అలా తన బుల్లితెర ప్రయాణం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు.

అర్చన నాన్న కన్నడ సినిమాలో పేరున్న నటుడు.ఆయన పేరు అనంత వేలు.

Telugu Anasuya Serial, Archanan Ananth, Deepa, Babu, Karthikadeepam, Maa-Latest

నటిగా మారిన పదేళ్లకు కానీ తెలుగులో తనకు అవకాశం లభించలేదన్నారు అర్చన.కార్తీకదీపంలో సౌందర్య క్యారెక్టర్‌ కోసమే తనకు ఇన్నేళ్లూగా అవకాశం లభించలేదేమోనని అనుకునేవారట.కార్తీకదీపంలో సౌందర్య పాత్ర లభించడం తన అదృష్టం అని పేర్కోన్నారు.తన సినిమా రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ.కన్నడలో ఇప్పటికే మూడు చిత్రాలు చేశానని.కానీ తెలుగులో ఓ మంచి క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇవ్వాలనీ కోరుకుంటున్నాను అని అన్నారు.

ఎలా అనుకుంటున్నారు అంటే.ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీర్ ‌గా కనిపించాలనుకుంటున్నాను అని చెప్పారు.

‘దాసీ’ క్యారెక్టర్‌లో కూడా నటించాలని ఉందని చెప్పారు అర్చన.ఏవైనామంచి అవకాశాలు వస్తే ఓటీటీలలో కూడా నటిస్తానని చెప్పారు.

మరిమన సౌందర్య అత్త భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube