విశ్వ నటుడిగా పేరుపొందిన కమల్ హాసన్( Kamal Haasan ) వయసు ప్రస్తుతం 66 ఏళ్ళు.2022 లో విక్రమ్ సినిమాతో( Vikram Movie ) బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు కమల్.దాదాపు పాతికేయ క్రితం వచ్చిన భారతీయుడు( Bharateeyudu ) సినిమాతో అందుకున్న బ్లాక్ బస్టర్ తర్వాత ఆ రేంజ్ విజయం మళ్ళీ విక్రమ్ తోనే దక్కింది కమల్ హాసన్ కి.ఇన్నేళ్లలో ఆ రెంజ్ విజయమైతే దక్కలేదు మధ్యలో ఒకటి రెండు సినిమాలు విజయవంతం సాధించిన విక్రమ్ రేంజ్ లో బ్లాక్ బాస్టర్స్ అయితే కాదు.అలాగే ప్రస్తుతం విక్రమ్ సినిమా తర్వాత కమల్ హాసన్ తన రెండవ వర్షన్ అంటే 2.0 అనే అర్థం వచ్చే విధంగా భారీ యాక్షన్ సినిమాలకు తెర లేపారు.
మునుపెన్నడూ లేని విధంగా విక్రమ్ సినిమా కమల్ హాసన్ కి మంచి బూస్ట్ అందించగా, ఆ తర్వాత సైతం అదే రకమైన యాక్షన్ సినిమాలకే కమల్ హాసన్ ప్రస్తుతం ఆమోదం తెలుపుతున్నాడు.ఇప్పటికే ఇండియన్ 2 సినిమా( Indian 2 ) షూటింగ్ ని పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఈ సినిమాలో కూడా అంచనాలను మించి యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయనేది ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చూస్తే అర్థమవుతుంది.అలాగే ఆ సినిమా తర్వాత తగ్ లైఫ్( Thug Life ) అనే మరో తమిళ సినిమాలో కమల్ హాసన్ నటించిబోతున్నాడు.
దీనికి మణిరత్నం దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
ఇక ఇది కాకుండా హెచ్.వినోద్( H Vinod ) దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్న కమల్ హాసన్ ఖచ్చితంగా మంచి యాక్షన్ సినిమా గానే తీయబోతున్నట్టుగా సమాచారం పక్కాగా అందుతుంది.ఇక ఇండియన్ 2, తగ్ లైఫ్ అలాగే డైరెక్టర్ హెచ్.
వినోద్ సినిమాలన్నీ కూడా దాదాపు 200 కోట్లకు పైగానే బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్నాయి.అంటే కమల్ హాసన్ పై దాదాపు 600 కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు సిద్ధం గా ఉన్నారు.
ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో వీర కుమ్ముడు కుమ్ముతున్న కమల్ హాసన్ ఈ వయసులో యాక్షన్స్ సన్నివేశాల కోసం భారీగా కసరత్తులు చేయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.