తెలుగులో చందమామ సినిమాతో వెండితెరకు పరిచయమై తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసినటువంటి బ్యూటీ కాజల్ అగర్వాల్.ఈ అమ్మడు టాలీవుడ్ లో దాదాపుగా అందరి ప్రముఖ హీరోలతో ఆడిపాడి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
తాజాగా కాజల్ అగర్వాల్ ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.ఇందులో భాగంగా సాంప్రదాయబద్ధంగా చీరకట్టులో ఫోటోలకి ఫోజులిచ్చింది.
ఇప్పటికే ట్రెడిషనల్ లుక్ లో మంచి పేరు తెచ్చుకున్న టువంటి కాజల్ అగర్వాల్ ఈ ఫోటోలతో మరింతగా తెలుగు ప్రేక్షకులను అలరించింది. అంతేగాక ఈ చీరకట్టులో దిగినటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే దాదాపు మూడు లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.
దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు కాజల్ అగర్వాల్ కి ఫ్యాన్ ఫైన్ ఫాలోయింగ్ ఎలా ఉందో అని.మరిన్ని ఫోటోలు చూడాలంటే కాజల్ అగర్వాల్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ని చూడవచ్చు.
అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న టువంటి భారతీయుడు 2 చిత్రంలో నటిస్తోంది.అంతేగాక పారిస్ పారిస్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు.