యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ మంచి హిట్ అందుకోవడంతో ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు.
అయితే ఎన్టీఆర్ తాజాగా కొత్త లుక్ లోకి మారిపోయిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మాస్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న తారక్ ఇప్పుడు క్లాసిక్ లుక్ తో ఆకట్టు కుంటున్నాడు.
ఈయన ఫోటోలు చూసిన ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.
ప్రెజెంట్ జపాన్ లో ఉన్న తారక్ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేయడంతో ఈయనపై మరింత క్రేజ్ పెంచుకుంటున్నారు.
ఇటీవల కాలంలో ఈయన కాస్త బరువు పెరిగి ఏ మాత్రం ఆకట్టుకునే లుక్ లో లేడు అని కామెంట్స్ వినిపించాయి.అయితే తాజాగా బయటకు వచ్చిన తారక్ పిక్స్ చూసి ఆ కామెంట్స్ ఇప్పుడు వర్తించవు అంటూ సంతోషంగా ఉన్నారు.
తాజాగా ప్రముఖ ఫోటో గ్రాఫర్ కమలేష్ ఎన్టీఆర్ న్యూ పిక్స్ ను షేర్ చేయగా ఆ ఫోటోలు చుసిన నందమూరి అభిమానులు మస్తు ఖుషీగా ఉన్నారు.తాజాగా ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమా జపాన్ వర్షన్ లో అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.ఈ క్రమంలోనే రాజమౌళి తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా జపాన్ వెళ్లి అక్కడ ప్రొమోషన్స్ చేస్తున్నారు.
ఆ సందర్భంగా తీసిన ఫొటోలే నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఎన్టీఆర్ కూల్ లుక్ తో పాటు ఆకట్టుకునే స్మైల్ తో అదిరిపోయాడు.ఇక ఈయన ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమాను ప్రకటించాడు.ఇంకా సెట్స్ మీదకు వెళ్లని ఈ సినిమా కోసమే తారక్ లుక్ చేంజ్ చేసినట్టు తెలుస్తుంది.
మరి మరింత యంగ్ గా కనిపిస్తున్న తారక్ ఈ సినిమాలో అదరగొట్టే అవకాశం ఉంది.