ప్రేమ వ్యవహారంలో జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య..!

తాను ప్రేమించిన యువతితో చనువుగా ఉండడం భరించలేకపోయిన మాజీ ప్రియుడు ఓ జూనియర్ ఆర్టిస్టును తన ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేశాడు.అనుమానంతో నలుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 Junior Artist Brutally Murdered In Love Affair , Mahabubabad, Crime , Crime , Cr-TeluguStop.com

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

విజయనగరం జిల్లా గొర్ల మండలం రాగోలుకు చెందిన టి.సాయి (20) హైదరాబాదులో ఉంటూ యూట్యూబర్ గా పనిచేసేవాడు.

సాయి కు జూనియర్ ఆర్టిస్ట్ అయిన యువతి (19) తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.కానీ సాయి ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ యువతి ఇతనిని దూరం పెట్టేసింది.

Telugu Karthik, Latest Telugu, Love, Mahabubabad-Latest News - Telugu

అయితే మహబూబాబాద్ జిల్లా( Mahabubabad ) సంకిస గ్రామానికి చెందిన కే.కార్తీక్(18) హైదరాబాదులో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసేవాడు.ఈ కార్తీక్ కు సాయి ప్రియురాలుతో పరిచయం ఏర్పడింది.గత నెలలో ఇద్దరూ కలిసి యూసుఫ్ గూడా లోని కార్తీక్ సోదరుడు శంకర్ గదికి వెళ్లి అక్కడే మూడు రోజులు ఉన్న విషయం సాయికి తెలిసి తట్టుకోలేకపోయాడు.

Telugu Karthik, Latest Telugu, Love, Mahabubabad-Latest News - Telugu

కార్తీక్ ను అడ్డు తొలగిస్తేనే తన ప్రియురాలు తనకు దక్కుతుందని భావించిన సాయి తన స్నేహితులైన విజయనగరం కు చెందిన కే.సురేష్, ఎం.రఘు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్.జగదీష్ సహాయంతో హత్య కోసం మాస్టర్ ప్లాన్ రచించాడు.ప్లాన్ లో భాగంగా గత నెల 13న ఈ నలుగురు వ్యక్తులు బైక్లపై కార్తీక్ ( Karthik )గదికి వెళ్లారు.ఆ యువతీకి సంబంధించిన దుస్తులు కొన్ని తమ గదిలోనే ఉన్నాయని, వాటిని తీసుకువెళ్లాలని కార్తీక్ ను నమ్మించారు.

కార్తీక్ ను బైక్ పై ఎక్కించుకొని ఓల్డ్ బోయిన్పల్లి పాత విమానాశ్రయం మార్గంలోని అటవీ ప్రాంతం వైపు తీసుకువెళ్లి చెట్టుకు కట్టేసి కత్తితో దాడి చేశారు.అంతటితో ఆగకుండా బాధితుడిని బోర్లా పడేసి పీక కోసేశారు.

పెద్ద బండరాయితో తలపై కొట్టారు.కార్తీక్ చనిపోయిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

హత్య అనంతరం ముగ్గురు నిందితులు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు కానీ సురేష్ మాత్రం మృతుడి సెల్ఫోన్ తీసుకొని నగరంలోనే ఉండిపోయాడు.అయితే మృతుడి సెల్ ఫోను సురేష్ ఆన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై సురేష్ ను అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించగా మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయింది.ఎముకలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి, నిందితులైన సాయి, రఘు, జగదీశ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube