ప్రేమ వ్యవహారంలో జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య..!
TeluguStop.com
తాను ప్రేమించిన యువతితో చనువుగా ఉండడం భరించలేకపోయిన మాజీ ప్రియుడు ఓ జూనియర్ ఆర్టిస్టును తన ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
అనుమానంతో నలుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
విజయనగరం జిల్లా గొర్ల మండలం రాగోలుకు చెందిన టి.సాయి (20) హైదరాబాదులో ఉంటూ యూట్యూబర్ గా పనిచేసేవాడు.
సాయి కు జూనియర్ ఆర్టిస్ట్ అయిన యువతి (19) తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
కానీ సాయి ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ యువతి ఇతనిని దూరం పెట్టేసింది. """/" /
అయితే మహబూబాబాద్ జిల్లా( Mahabubabad ) సంకిస గ్రామానికి చెందిన కే.
కార్తీక్(18) హైదరాబాదులో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసేవాడు.ఈ కార్తీక్ కు సాయి ప్రియురాలుతో పరిచయం ఏర్పడింది.
గత నెలలో ఇద్దరూ కలిసి యూసుఫ్ గూడా లోని కార్తీక్ సోదరుడు శంకర్ గదికి వెళ్లి అక్కడే మూడు రోజులు ఉన్న విషయం సాయికి తెలిసి తట్టుకోలేకపోయాడు.
"""/" /
కార్తీక్ ను అడ్డు తొలగిస్తేనే తన ప్రియురాలు తనకు దక్కుతుందని భావించిన సాయి తన స్నేహితులైన విజయనగరం కు చెందిన కే.
సురేష్, ఎం.రఘు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్.
జగదీష్ సహాయంతో హత్య కోసం మాస్టర్ ప్లాన్ రచించాడు.ప్లాన్ లో భాగంగా గత నెల 13న ఈ నలుగురు వ్యక్తులు బైక్లపై కార్తీక్ ( Karthik )గదికి వెళ్లారు.
ఆ యువతీకి సంబంధించిన దుస్తులు కొన్ని తమ గదిలోనే ఉన్నాయని, వాటిని తీసుకువెళ్లాలని కార్తీక్ ను నమ్మించారు.
కార్తీక్ ను బైక్ పై ఎక్కించుకొని ఓల్డ్ బోయిన్పల్లి పాత విమానాశ్రయం మార్గంలోని అటవీ ప్రాంతం వైపు తీసుకువెళ్లి చెట్టుకు కట్టేసి కత్తితో దాడి చేశారు.
అంతటితో ఆగకుండా బాధితుడిని బోర్లా పడేసి పీక కోసేశారు.పెద్ద బండరాయితో తలపై కొట్టారు.
కార్తీక్ చనిపోయిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.హత్య అనంతరం ముగ్గురు నిందితులు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు కానీ సురేష్ మాత్రం మృతుడి సెల్ఫోన్ తీసుకొని నగరంలోనే ఉండిపోయాడు.
అయితే మృతుడి సెల్ ఫోను సురేష్ ఆన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై సురేష్ ను అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించగా మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయింది.ఎముకలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి, నిందితులైన సాయి, రఘు, జగదీశ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దివ్యాంగుల కొరకు క మూవీ స్పెషల్ షో.. కిరణ్ మనస్సుకు వావ్ అనాల్సిందే!