Chiranjeevi Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చిన మెగాస్టార్ మూవీ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Jr Ntr Special Love Towards Chiranjeevi Film Rudraveena-TeluguStop.com

ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో( Devara Movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇందులో తారక్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ( RRR ) ప్రమోషన్స్ సమయంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ వీడియోలో తారక్ మాట్లాడుతూ.మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటించిన సినిమాలలో రుద్రవీణ సినిమా( Rudraveena Movie ) అంటే నాకు చాలా ఇష్టం.

ఇది 1988లో విడుదల అయింది.

తల్లి పేరు పై నాగబాబు నిర్మాతగా చిరు స్వంత బ్యానర్ మొదలుపెట్టిన కొత్తలో డెబ్యూ ప్రొడక్షన్ ఇది.కులాల అంతరాల గురించి సంగీతానికి ముడి పెడుతూ దర్శకుడు బాలచందర్ రుద్రవీణ సినిమాని ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది.యముడికి మొగుడు లాంటి కమర్షియల్ మసాలాలతో మాస్ ని ఊపేస్తున్న టైంలో చిరు చేసిన సినిమా కావడంతో రుద్రవీణ బాక్సాఫీస్ వద్ద డిజస్టర్ గా నిలిచింది.

కానీ మెగాస్టార్ లోని బెస్ట్ యాక్టర్ బయటికి వచ్చింది ఈ మూవీలోనే అని తెలిపారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube