బాలీవుడ్లో లిప్‌లాక్‌లు చాలా కామన్.సీన్లో అవసరం ఉన్నా లేకున్నా కూడా లిప్‌లాక్ సీన్స్‌ను ఇటీవల జొప్పించడం చాలా మామూలు విషయం అయ్యింది.
తాజాగా బాలీవుడ్లో జాన్ అబ్రహం మరియు శృతిహాసన్‌లు జతగా ఒక సినిమాలో నటిస్తున్నారు.ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం జాన్‌కు శృతిహాసన్‌కు మద్య లిప్‌లాక్ సన్నివేశాన్ని దర్శకుడు పెట్టాడు.అయితే తాజాగా శృతితో లిప్‌లాక్ సీన్‌ను క్యాన్సిల్ చేశాడు జాన్.
ఈ హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.జాన్ పెళ్లి చేసుకోబోతున్న ప్రియా రంచెల్కు సినిమాలు అంటే పెద్దగా పడదట.
దానికి తోడు ఈయన మరే హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్స్‌లో నటించినా కూడా ఆమెకు ఇష్టం ఉండదట.దాంతో జాన్ అబ్రహం ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్‌ను అయిష్టంగానే నో చెప్పినట్లుగా తెలుస్తోంది.
లిప్‌లాక్ సీన్‌కు నో చెప్పడంతో దర్శకుడు ప్రస్తుతం ఆ దిశగా స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.