రహస్య పత్రాల కేసు .. బైడెన్‌ను రెండు రోజుల పాటు విచారించిన ప్రత్యేక న్యాయవాది

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) పాత కార్యాలయంలో రహస్య పత్రాలు దొరకడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం అమెరికా రాజకీయాలను కీలక మలుపు తిప్పింది.

 Joe Biden Questioned By Special Counsel In Classified Documents Case Over Two Da-TeluguStop.com

బైడెన్‌పై విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని విపక్ష రిపబ్లికన్లతో పాటు మీడియా డిమాండ్ చేస్తోంది.ఈ క్రమంలో ఎన్నికలకు ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి.

కీలకమైన రహస్య పత్రాలను వుంచుకోవడంపై ఆయనను ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ హుర్( Special Counsel Robert Hur ) సోమవారం ఇంటర్వ్యూ చేసినట్లు వైట్‌హౌస్ కౌన్సెల్ కార్యాలయం తెలిపింది.

బైడెన్ ఇంటర్వ్యూ స్వచ్ఛందంగా రెండు రోజుల పాటు జరిగిందని వైట్‌హౌస్ కౌన్సెల్ కార్యాలయ ప్రతినిధి ఇయాన్ సామ్స్( Ian Sams ) చెప్పారు.2009-17 మధ్యకాలంలో ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వర్తించిన తర్వాత బైడెన్ కోసం ఏర్పాటు చేసిన థింక్ ట్యాంక్ కార్యాలయంలో. ఆయనకు చెందిన విల్మింగ్టన్, డెలావేపర్ నివాసాల్లో రహస్య పత్రాల అక్రమ నిల్వలను పరిశీలించడానికి ఈ ఏడాది జనవరిలో యూఎస్ అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ .హుర్‌ను ప్రత్యేక న్యాయవాదిగా నియమించారు.

Telugu Classified, Donald Trump, Ian Sams, Joe Biden, Joebiden, Counsel, White-T

ఈ తరహా ప్రత్యేక న్యాయవాదులను సున్నితమైన కేసులను నిర్వహించడానికి నియమిస్తారు.సాధారణంగా రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వం చేసిన తీవ్రమైన తప్పులను వీరు విచారిస్తారు.ఈ సందర్భంగా అభియోగాలు మోపాలా వద్దా అని నిర్ణయించడానికి ఫెడరల్ పరిశోధకులకు ఎక్కువ స్వాతంత్య్రం వుంటుంది.

ఈ క్రమంలోనే బైడెన్‌తో హుర్ ఇంటర్వ్యూలు చప్పుడు లేకుండా జరుగుతున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.క్లాసిఫైడ్ మెటీరియల్స్( Classified Materials ) కనిపించడంతో తాను ఆశ్చర్యపోయానని , తన బృందం విచారణకు సహకరిస్తుందని అధ్యక్షుడు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు వైట్‌హౌస్ నిరాకరించింది.

Telugu Classified, Donald Trump, Ian Sams, Joe Biden, Joebiden, Counsel, White-T

కాగా.గతంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) చెందిన ఫ్లోరిడా రిసార్ట్స్‌లోనూ ఇదే తరహాలో రహస్య పత్రాలు దొరకడం అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రస్తుత, మాజీ అధ్యక్షుల వ్యవహారాలను పోల్చి చూస్తూ పెద్ద చర్చ జరిగింది.

అయితే బైడెన్‌కు సంబంధించిన ఈ ఇష్యూ రానున్న రోజుల్లో అమెరికా రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube