ఎన్నికల్లో ఓటమితో ట్రంప్ ఏం చేస్తున్నాడో.ఎందుకు చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.
తన ప్రత్యర్థి బైడెన్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు.ప్రెసిడెంట్- ఎలక్ట్ హోదాలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ట్రంప్ అడ్డుపడుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో జో బైడెన్ స్పందించారు.కరోనా వైరస్ విషయంలో తన బృందంతో అధ్యక్షుడు ట్రంప్ పాలకవర్గం సహకరించాలని కోరారు.
వ్యాక్సిన్ ప్రణాళికలు, జాతీయ భద్రత, విధానపరమైన సమస్యల్ని అధికార బదిలీ నిమిత్తం ఏర్పాటు చేసిన తన బృందంతో పంచుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అలాగే కొత్త ఉపశమన చట్టాన్ని ఆమోదించాలని యుఎస్ కాంగ్రెస్‌ను జో బైడెన్ కోరారు.కోవిడ్ -19 తరువాత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి వ్యాపారవేత్తలు , కార్మిక నాయకులు కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వ్యాక్సిన్ పంపిణీ చాలా కీలకమైన ప్రక్రియ అన్న బైడెన్ .దానికోసం తక్షణమే ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.తాను అధికార బాధ్యతలు చేపట్టబోయే జనవరి 20 వరకు వేచిచూస్తే మహమ్మారిని అరికట్టడానికి సమయం మించిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తమతో సహకరించాలని అధ్యక్షుణ్ని కోరారు.
అవసరమైతే తానూ వ్యాక్సిన్ తీసుకుంటానని బైడెన్ తెలిపారు.తద్వారా టీకా భద్రతపై ప్రజల్లో నెలకొన్న భయాలు తొలగిపోతాయని వ్యాఖ్యానించారు.
కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బైడెన్ చెప్పారు.

ఇక తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత… మొదటగా కరోనాపై తక్షణ చర్యలు ఉంటాయని ఇప్పటికే బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో ఇప్పటి నుంచే ఆ దిశగా బైడెన్ అడుగులు వేస్తున్నారు.దీనిలో భాగంగా 12 మంది సభ్యులతో కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
ఈ బృందం మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యూహా రచనలు చేయనుంది.టాస్క్‌ఫోర్స్ సలహాలు, సూచనలతో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొవిడ్‌పై తక్షణ చర్యలకు ఉపక్రమించనున్నారు.
ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఇద్దరు ఇండియన్ అమెరికన్ వైద్యులకు కూడా జో బైడెన్ స్థానం కల్పించారు.డాక్టర్ వివేక్ మూర్తి, డాక్టర్ అటుల్ గావాండే కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యులుగా ఉండనున్నారు.