టోక్యో ఎయిర్ పోర్ట్ లో రశ్మికకు సర్ ప్రైజింగ్ వెల్కమ్ చెప్పిన జపాన్ ఫ్యాన్స్

క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్ లోని టోక్యో వెళ్లింది స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న.రేపు టోక్యోలో క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ జరగనున్నాయి.

 Japanese Fans Gave A Surprising Welcome To Rashmika At Tokyo Airport , Rashmika-TeluguStop.com

గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మనదేశం నుంచి రశ్మిక రిప్రెజెంట్ చేస్తోంది.ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రశ్మిక నిలిచింది.

టోక్యో ఎయిర్ పోర్ట్ లో ఆమెకు జపాన్ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.రశ్మిక ఫొటోస్ తో డిజైన్ చేసిన ఫ్లకార్డులు చూపిస్తూ ఆమెను ఆహ్వానించారు.

ఎయిర్ పోర్ట్ లో అభిమానులు ఇచ్చిన వెల్కమ్ తో రశ్మిక ఆశ్చర్యపోయింది.సర్ ప్రైజ్ అవుతూ వారికి హాయ్ చెప్పింది.

పుష్ప, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో నేషనల్ క్రష్ గా మాత్రమే కాదు గ్లోబల్ గా రశ్మిక అభిమానులను సంపాదించుకుంది.జపాన్ లోనూ రశ్మికకు ఫ్యాన్స్ ఉన్నారు.

వారు తనపై చూపిస్తున్న ప్రేమకు రశ్మిక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.ప్రస్తుతం రశ్మిక మందన్న “పుష్ప 2”, “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలతో పాటు ఓ హిందీ ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube