సినీ దర్శకుడు క్రిష్( Director krish ) ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు( Telangana High Court )లో విచారణ జరిగింది.హైదరాబాద్ లోని రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో క్రిష్ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని క్రిష్ పిటిషన్ లో పేర్కొన్నారు.
డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్న ఆయన నిందితుడు వివేకానంద ఇచ్చిన స్టేట్ మెంట్ తో తనను కేసులో చేర్చారని కోర్టుకు తెలిపారు.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం డ్రగ్స్ పార్టీ( Radisson Drugs Party Case ) కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
అయితే డ్రగ్స్ పార్టీ కేసులో డైరెక్టర్ క్రిష్ ను గచ్చిబౌలి పోలీసులు ఏ10గా పేర్కొన్న సంగతి తెలిసిందే.