అమెరికాలో జనసేన అధ్యక్షుడి పర్యటన..   Janasena Meeting In America With Pawan Kalyan     2018-12-01   15:41:33  IST  Surya

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ లో అమెరికాలో పర్యటన చేపట్టనున్నారని తెలుస్తోంది. ఆయన ఈనెల 14 వ తేదీన డల్లాస్ కి చేరుకొని అక్కడి నుంచీ 15 వ తేదీన ఇర్వింగ్‌లోని టొయోటా మ్యూజిక్‌ ఫ్యాక్టరీలో అక్కడి జనసేన పార్టీ తరుపున ఉండే ఎన్నారైలు ఏర్పాటు చేసిన ప్రవాస గర్జనలో పాల్గొని ఎన్నారైలను ఉద్దేశించి పవన్‌కళ్యాణ్‌ ప్రసంగిస్తారని తెలుస్తోంది..అయితే

ఈ కార్యక్రమం సాయంత్రం 5.30 నుంచి 11 వరకు జరుగుతుందని..ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జనసేన ఎన్నారై విభాగం హ్యూస్టన్‌లోని అన్నీ ప్రాంతాల నుంచీ వేదిక వద్దకి బస్ లని కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రవేశం కూడా ఉచితమని తెలిపారు..

Janasena Meeting In America With Pawan Kalyan-NRI Kalyan Telugu NRI

అంతేకాదు అమెరికాలో అందుబాటులో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు తప్పకుండా రావాలని విజ్ఞప్తి చేశారు..ఈ వేదికని ఎన్నారైల తో ఏర్పాటు చేయడానికి అమెరికాలో ఎన్నారై జనసేన నాయకులు కాట్రోతు సురేష్‌..శ్రీనివాసులు రామిసెట్టి…నాగు కూనసాని తదితరులు పర్యవేక్షణ చేస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.