జగ్గూ భాయ్ సింప్లిసిటీ.. జనమంతా ఫిదా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా కుటుంబ కథా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే జగపతిబాబు గతంలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి సందడి చేశారు.

 Jagapathi Babu, Road Side, Eating, Assistant.latest News Socail Media-TeluguStop.com

మధ్యలో సినిమాలకు కాస్త విరామం ఇచ్చినప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను హీరోగా కాకుండా విలన్ పాత్రలు చేస్తూ సరైన ఎంట్రీ ఇచ్చారు.హీరో కన్నా విలన్ పాత్రలు అద్భుతమైన విజయాలను అందిస్తున్నాయని ఓ సందర్భంలో జగపతిబాబు తెలియజేశారు.

ప్రస్తుతం సినిమాలలో పవర్ ఫుల్ విలన్ పాత్రలను పోషిస్తూ కెరియర్ పరంగా జగపతి బాబు ఎంతో బిజీగా అయ్యారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు ఎలాంటి గర్వం లేకుండా తన సింప్లిసిటీతో అందరి మన్ననలు పొందుతున్నారు.

అదే విధంగా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై కూడా జగపతిబాబు స్పందిస్తుంటారు.ఇక ఎప్పుడు కులం మతం అంటూ కులం పేరును చెప్పకుండా అందరితో ఎంతో మర్యాదగా నేర్చుకునే స్వభావం జగపతిబాబుకి సొంతమని చెప్పవచ్చు.

Telugu Assistant, Jagapathi Babu, Road-Movie

జగపతి బాబు ఒక స్టార్ సెలబ్రిటీ అన్నగర్వం ఏ మాత్రం లేకుండా తన దగ్గర పనిచేసే వారితో కూడా ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారనే ఈ విషయాన్ని ఇదివరకే చాలాసార్లు గమనించాము.ఇకపోతే తాజాగా జగపతి బాబు ఒక రోడ్ సైడ్ డాబాలో తన అసిస్టెంట్లతో కూర్చుని భోజనం చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.

చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి భోజనం చేసామని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం జగపతిబాబు షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు జగ్గు భాయ్ సింప్లిసిటీ కి ఫిదా అయ్యారు.

ఈ క్రమంలోనే కొందరి నెటిజన్లు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదా? ఎంతో సింప్లిసిటీని మెయింటేన్ చేస్తున్నారంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube