కళ్లు లేకపోయినా రామ జన్మభూమి కేసును గెలిపించిన ఒకే ఒక్కడు.. ఈ గురువు కథ తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

మరికొన్ని రోజుల్లో అయోధ్య రామమందిరం ( Ayodhya Ram Mandir )ప్రారంభోత్సవం జరగనుండగా అయోధ్య రామ జన్మభూమి కేసులో రాముడు అయోధ్యలోనే జన్మించాడని సరైన ఆధారాలతో సహా ప్రూవ్ చేసిన వ్యక్తి శ్రీ జగద్గురువులు శ్రీరామభద్రాచార్యులు( Sri Jagadguru Sri Ramabhadracharya ) కావడం గమనార్హం.పుట్టుకపోతే అంధుడైన శ్రీరామభద్రాచార్యులు అయోధ్యలో రాముడు జన్మించాడని ప్రూవ్ చేస్తూ 441 సాక్ష్యాధారాలను సమర్పించగా అందులో 437 సాక్ష్యాలను కోర్టు అంగీకరించింది.

 Jagadguru Sri Ramabhadracharya Inspirational  Success Story Details Here Goes Vi-TeluguStop.com

రామచరిత్ మానస్( Ramacharit Manas ) లో రామ జన్మభూమి గురించి ప్రస్తావన ఉందా అనే ప్రశ్నకు ఆ ప్రస్తావన ఉన్న సెయింట్ తులసీదాస్ చాపాయిని శ్రీ రామభద్రాచార్యులు వివరించారు.వేదాల్లో ఉన్న ఆధారాలు ఏంటనే ప్రశ్నకు సమాధానంగా అథర్వ వేదం రెండవ మంత్రం దశమ కాండ 31వ అనువాదం నిదర్శనమని ఆయన కోర్టులో చెప్పారు.

రాముడు అయోధ్యలో పుట్టలేదని దాఖలైన అఫిడవిట్ కు సంబంధించి శ్రీరామభద్రాచార్యులు గురుగ్రంథ సాహిబ్ ( Guru Granth Sahib )లో రాముడి పేరు 5600 సార్లు ప్రస్తావించారని పేర్కొన్నారు.

Telugu Ayodhya, Jagadgurusri, Rama Mandir, Srijagadguru-Inspirational Storys

శ్రీరామభద్రాచార్యులుకు కళ్లు లేకపోయినా శ్రీరామునిపై ఉన్న భక్తి వల్లే ఆయనకు ఈ సమాచారం తెలుసని చాలామంది భావిస్తారు.శ్రీరామభద్రాచార్యులు అంధుడినైనా తాను అంధుడినని ఎప్పుడూ అనుకోనని ఈ ప్రపంచాన్ని చూడాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు.నేను శ్రీరాముడిని చాలా దగ్గరగా చూస్తానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Ayodhya, Jagadgurusri, Rama Mandir, Srijagadguru-Inspirational Storys

శ్రీరామునిపై శ్రీరామభద్రాచార్యులుకు ఉన్న భక్తికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఆయన భక్తి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.శ్రీరామభద్రాచార్యులు వయస్సు 75 సంవత్సరాలు కాగా ఆయన 230 పుస్తకాలు రాశారు.అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.టాలీవుడ్ నుంచి సైతం పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందిందనే సంగతి తెలిసిందే.చిరంజీవి, ప్రభాస్, పవన్ మరి కొందరు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందిందని సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube