అక్కడ గుంటూరు కారం సినిమాపై పైచేయి సాధించిన హనుమాన్.. నమ్మకపోయినా నిజమిదేనంటూ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు సంక్రాంతి సినిమాలతో కళకళలాడుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన హనుమాన్ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా గుంటూరు కారం, సైంధవ్ సినిమాలు మిక్స్డ్ టాక్ తో ప్రదర్శితం అవుతున్నాయి.

అయితే బుక్ మై షోలో గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమపై హనుమాన్ పైచేయి సాధించడం హాట్ టాపిక్ అవుతోంది.బుక్ మై షో గంటకు ఏ సినిమాకు ఎన్ని టికెట్లు బుకింగ్ అవుతున్నాయనే వివరాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

గుంటూరు కారం సినిమాకు గంటకు 12600 టికెట్లు బుక్ కాగా అదే సమయంలో హనుమాన్ సినిమాకు 16600 టికెట్లు అమ్ముడయ్యాయి.నిన్న జరిగిన బుకింగ్స్ ను పరిశీలిస్తే ఈ లెక్కలు వెలుగులోకి వచ్చాయి.యూఎస్ లో కూడా హనుమాన్ సినిమాకు ఊహించని స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

హైదరాబాద్ లో 230 షోలకు 228 షోలు హనుమాన్ ఫుల్ కాగా గుంటూరు కారం థియేటర్ల సంఖ్యతో పోల్చి చూస్తే ఫుల్ అయిన థియేటర్లు తక్కువగా ఉన్నాయి.

Advertisement

స్టార్ స్టేటస్ కంటే కంటెంట్ ముఖ్యమని కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు సైతం సంచలన విజయాలను సొంతం చేసుకుంటాయని హనుమాన్ మూవీ ప్రూవ్ చేసింది.హనుమాన్ మూవీ( Hanuman ) బుకింగ్స్ సైతం అదుర్స్ అనేలా ఉండగా ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్ మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది.

హనుమాన్ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించి మేకర్స్ ఆశ్చర్యపోయేలా చేశారు.దాదాపుగా 30 కోట్ల రూపాయల రేంజ్ లో హనుమాన్ మూవీకి బిజినెస్ జరగగా ఈ సినిమా ఫుల్ రన్ లో బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉంది.హనుమాన్ మూవీ చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు