రేపు అమరావతిలో చంద్రబాబు - పవన్ నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు అమరావతిలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.ఇందులో భాగంగా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై వినూత్న కార్యక్రమం నిర్వహించనున్నారు.

 Chandrababu-pawan Protest In Amaravati Tomorrow-TeluguStop.com

ఈ క్రమంలోనే రేపు జరిగే భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలపనున్నారు.

రా కదలి రా పేరుతో టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.రేపు సాయంత్రం గ్రామస్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.

స్థానికంగా నెలకొన్న సమస్యలతో పాటు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై తీర్మానం చేయాలని సూచించారు.మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు చంద్రబాబు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube