జబర్దస్త్ షో ( Jabardasth Show )ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న మహీధర్ ఆ తర్వాత యూట్యూబర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సక్సెస్ ఫుల్ యూట్యూబర్( YouTuber )గా ఎదిగారు.మహీధర్ ఇచ్చే సినిమా రివ్యూలకు సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఎక్కువ సంఖ్యలో యూట్యూబ్ ఛానెళ్లను కలిగి ఉన్న మహీధర్ ఆ ఛానెళ్ల ద్వారా కళ్లు చెదిరే రేంజ్ లో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.అయితే ఇన్ స్టాగ్రామ్ వేదికగా మహీధర్ ఒక వీడియోను షేర్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఎప్పుడూ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా చెప్పని మహీధర్ తన లవ్ గురించి, లవ్ ఫెయిల్యూర్ గురించి సరదాగా చెప్పుకొచ్చారు.అదే సమయంలో తన లవ్ ను రిజెక్ట్ చేసిన అమ్మాయి గురించి కూడా మహీధర్( Mahidhar ) సెటైర్లు వేశారు.
మహీధర్ తన వీడియోలో మొదట ఏపీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు.
తెలంగాణ( Telangana )లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.రాయలసీమలో ఉండే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని మహీధర్ తెలిపారు.అనంతపూర్ లో ఏకంగా 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ఆయన వెల్లడించడం గమనార్హం.
అక్కడ నివశించే ప్రజలకు 47, 48 డిగ్రీల వేడి ఉన్నట్టు ఫీలింగ్ ఉందని ఆయన అన్నారు.అందువల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలని మహీధర్ అన్నారు.ఆ తర్వాత నేను మీకొక స్టోరీ చెప్పాలని నేను హైదరాబాద్( Hyderabad ) లో ఉన్న సమయంలో హైదరాబాద్ కు చెందిన ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.పెళ్లి చేసుకుందామని చాలాసార్లు అడిగి చూశానని ఆ అమ్మాయి నాకు ప్రేమంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పిందని మహీధర్ అన్నారు.
ఆ అమ్మాయి అరేంజ్డ్ మ్యారేజ్( Arranged Marriage ) చేసుకుందని అమ్మాయి భర్త అనంతపూర్ లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడని మహీధర్ తెలిపారు.ఇప్పుడు బాగా అయింది నీకు అంటూ మహీధర్ ఆ యువతిపై సెటైర్లు వేశారు.అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో మహీధర్ సరదాగా ఈ కామెంట్లు చేశారు.అక్కడ ఎండల్లో మాడు బాగా అంటూ మహీధర్ చేసిన కామెంట్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయి.
ఎండకు చెమట పడుతుంటే విసనకర్రతో ఊపుకో అని మహీధర్ పేర్కొన్నారు.మనం లవ్ చేసిన వాళ్లు ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదని అయితే రిజెక్ట్ చేసింది కాబట్టి రివేంజ్ ఈజ్ రివేంజ్( Revenge ) అని ఆయన అన్నారు.
ఇదెక్కడి మాస్ రివేంజ్ మావా అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తి ఇంట్లో ఏసీ పెట్టించి ఉంటాడని మరి కొందరు చెబుతున్నారు.