పెళ్లి పీటలెక్కిన జబర్దస్త్ ఐశ్వర్య.. స్టేజ్ మీదే ప్రియుడు తాళి కట్టేయడంతో?

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల ద్వారా, జబర్దస్త్ షో( Jabardasth ) ద్వారా పాపులర్ అయిన వాళ్లలో ఐశ్వర్య ఉల్లింగల( Aishwarya Ullingala ) ఒకరు.సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఏకంగా 1,62,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.

 Jabardast Aishwarya Marriage With Boyfriend Srinivas Sai On Jabardasth Stage Det-TeluguStop.com

తన టాలెంట్ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ తన ప్రియుడుతో జబర్దస్త్ వేదికపై తాళి కట్టించుకుని వార్తల్లో నిలిచారు.సినిమా హీరోయిన్ల స్థాయిలో అందంగా కనిపించే ఐశ్వర్య పెళ్లి వార్తతో అందరినీ ఒకింత ఆశ్చర్యపరిచారు.

జబర్దస్త్ స్టేజ్ పై శ్రీనివాస్ సాయి( Srinivas Sai ) అనే వ్యక్తిని ఐశ్వర్య పెళ్లి చేసుకోవడం గమనార్హం.ఐశ్వర్య పెళ్లికూతురి గెటప్ లో నాకు లైఫ్ ఇచ్చిన ఈ జబర్దస్త్ స్టేజ్ పై నా జీవిత భాగస్వామి ఎవరు అనేది పరిచయం చేయాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ స్టేజ్ మీదే మీరిద్దరూ కలవడం చాలా కంగ్రాట్స్ అని కృష్ణభగవాన్ చెప్పగా అయ్య బాబోయ్ అంటూ ఇంద్రజ సమాధానం ఇవ్వడం గమనార్హం.

శ్రీనివాస్ సాయి మోకాళ్లపై స్టైల్ గా కూర్చుని రోజ్ ఫ్లవర్ ఇచ్చి తన ప్రేమను ప్రపోజ్ చేశారు.ఆ తర్వాత శ్రీనివాస్ సాయి ఐశ్వర్య మెడలో తాళి కట్టారు.జబర్దస్త్ ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా ఈ నెల 13వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

సౌమ్యారావుపై ప్రోమోలో వేసిన సెటైర్లు భలే పేలాయి.ఆ తర్వాత వెంకీ మాకు ఎందుకు విన్నర్ గా ఇవ్వలేదో తెలుసుకోవచ్చా అని అడగగా ఇంద్రజ ఫైర్ అయ్యారు.

ఈ మధ్య కాలంలోని జబర్దస్త్ ప్రోమోలతో పోల్చి చూస్తే ఈ ప్రోమో బెస్ట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జబర్దస్త్ షోకు గతంతో పోల్చి చూస్తే రేటింగ్స్ తగ్గాయి.ఐశ్వర్య శ్రీనివాస్ సాయి సంతోషంగా ఉండాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube