ఏపీ టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు.ఈ మేరకు రాష్ట్రంలో ఓట్ల తొలగింపుతో పాటు బోగస్ ఓట్ల నమోదుపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఏపీలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీడీపీ ఫిర్యాదులో పేర్కొంది.అధికారంలో ఉన్న వాళ్లే ఫిర్యాదు చేయడం దౌర్భాగ్యమని ఎంపీ కనకమేడల అన్నారు.
తాము ఫిర్యాదు చేస్తామని తెలిసి ముందే వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు.పది లక్షల దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్న ఎంపీ కనకమేడల వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడంపైనా ఫిర్యాదు చేశామని తెలిపారు.
అయితే ఈ ఫిర్యాదులపై స్పందించిన అధికారులు ఈనెల 22న ఏపీకి వస్తామన్నారని వెల్లడించారు.