ఆర్య సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాతోనే ఆయన దర్శకుడి గా మంచి పేరు సంపాదించుకున్నారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది అలాగే అల్లు అర్జున్ కెరియర్ కి కూడా చాలా ప్లస్ అయింది అప్పటికి గంగోత్రి సినిమా చేసి హిట్ కొట్టినప్పటికీ అల్లు అర్జున్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిన సినిమా అయితే ఆర్య అనే చెప్పాలి.
ఈ సినిమా తర్వాత సుకుమార్ జగడం సినిమా స్టోరీ రాసుకొని దిల్ రాజు బ్యానర్ లోనే సెకండ్ సినిమా చేయాలి అనుకొని దిల్ రాజుకి జగడం కథ చెపితే ఆ కథ సరిగ్గా లేదని చెప్పిన దిల్ రాజు కథ మార్చు సినిమా చేద్దాం అనడం తో సుకుమార్ కి నచ్చలేదు ఇంత మంచి కథ మార్చడం దేనికి అని దిల్ రాజు తో వాదించాక కూడా దిల్ రాజు ఆ కథ సరిగ్గా లేదు అని ఎంత చెప్పిన వినకుండా సుకుమార్ దిల్ రాజు నుంచి బయటికి వచ్చేసి వేరే ప్రొడ్యూసర్స్ తో జగడం సినిమా చేసాడు అయితే ముందుగా ఈ సినిమాలో మహేష్ బాబు ని హీరో గా అనుకున్నాడు కానీ కుదరలేదు దిల్ రాజు కనక ప్రొడ్యూస్ చేసి ఉంటె ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేసేవాడు…ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ అయి ప్లాప్ అయింది.
ఇక ఈ సినిమా టాపిక్ వచ్చిన ప్రతిసారి సుకుమార్ ఆ విషయం గురించి చెప్తూ ఆ రోజు దిల్ రాజు గారు చెప్పింది కరెక్ట్ నేనే వినలేదు నేనే అప్పుడు కొంచం మొండిగా ప్రవర్తించా అని చెప్పాడు… ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా చేస్తూ బిజీ గా ఉన్నాడు పుష్ప మొదటి పార్ట్ చాలా పెద్ద హిట్టు అవ్వడం తో పుష్ప సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలే ఉన్నాయి… అలాగే జగడం లో హీరోగా చేసిన రామ్ కూడా బోయపాటి తో ఒక సినిమా చేస్తున్నాడు.