అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే.ఈ సంఘటనతో ఒక్క సారిగా ఉలిక్కిపడిన శ్వేత సౌధం వర్గాలు ఒక్కొక్కరిగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాయి.
ట్రంప్ కు అత్యంత సన్నిహితురాలైన హాప్ హిక్స్ కి కరోనా సోకగా ఆమె నుంచీ ట్రంప్ ఆయన సతీమణి మెలానియా కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు.
అయితే ట్రంప్ ఆరోగ్యం క్షీణించితే మరి అమెరికా పాలనా వ్యవహారాలు ఎవరు చూస్తారు, అధ్యక్ష అధికారాలు ఎవరికి బదిలీ చేయాలి అనేది ఇప్పుడు చర్చనీయంసంగా మారింది.
అధ్యక్షుడికి అనారోగ్యంగా ఉన్న సమయంలో పాలనా వ్యవహారాలు చూడలేని క్రమంలో అధ్యక్ష అధికారాలు బదిలీ చేయవచ్చని అంటున్నారు విశ్లేషకులు.
అమెరికా రాజ్యాంగం 25వ అధికరణ ప్రకారం.ఉపాధ్యక్షుడికి అధికారాలు బదిలీ చేయవచ్చని అంటున్నారు.
అధ్యక్షుడు ఎప్పుడు కోలుకుంటే అప్పుడు మళ్ళీ తన అధికారాలు తిరిగి పొందవచ్చని కూడా తెలుస్తోంది.ఇప్పటి వరకూ అమెరికా చరిత్రలో ఇలా మూడు సార్లు అధ్యక్షులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.
1967 లో అధికార బదిలీల అంశంపై అధికారిక రాజ్యంగ సవరణ జరిగింది.1985 లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ అప్పటి ఉపాధ్యక్షుడు జార్జ్ బుష్ కి ఈ విధంగానే అధికారాన్ని అప్పగించారు.తదుపరి రోజుల్లో జార్జ్ బుష్ అధ్యక్షుడి హోదాలో అప్పటి ఉపాధ్యక్షుడు డిక్ చినాయ్ కి అధ్యక్ష భాద్యతలు అప్పగించారు.అయితే ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యం కుదుటపడకపొతే ఉపాధ్యక్షుడుకి అధికారాలు అప్పగించవచ్చు, ఒకవేళ ఆయన కూడా అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతుంటే స్పీకర్ నాన్సీ ఫెలోసీ కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.