ఐరన్ లెగ్ శాస్త్రి రెమ్యూనరేషన్ ఎంతంటే..?

తెలుగు సినీ పరిశ్రమలో ఐరన్ లెగ్ శాస్త్రి గా ప్రాచుర్యం పొందిన గునుపూడి విశ్వనాథ శాస్త్రి పేరుగాంచిన హాస్యనటుడు.పలు చిత్రాల్లో పురోహితుని పాత్ర పోషించిన టాలీవుడ్ తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

 Iron Leg Shastri Remuneration-TeluguStop.com

ఆయన మొదట్లో సినిమాల ప్రారంభోత్సవాలకు పౌరోహిత్యం వహించేవారు.ఆ తర్వాత దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ఆయనకు సినిమాల్లో నటుడిగా అవకాశం ఇచ్చారు.ప్రేమ ఖైదీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఆయన, అప్పటినుంచి ఐరన్ లెగ్‌ శాస్త్రిగా ఆయన సినీ జర్నీ మొదలైందని చెప్పవచ్చు.

దాదాపు 200 సినిమాలు, 150 సీరియల్లు, స్టేజ్ ప్రోగ్రామ్స్‌లలో అన్నింటిలోనూ ఆయన ప్రత్యేకమైన ప్రతిభను కనబరిచేవారని ఐరన్ లెగ్ శాస్త్రి కుమారుడు ప్రసాద్ తెలిపారు.ప్రతీదానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉన్నట్టే నాన్న గారికి కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ వచ్చేందని ఆయన అన్నారు.

 Iron Leg Shastri Remuneration-ఐరన్ లెగ్ శాస్త్రి రెమ్యూనరేషన్ ఎంతంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకానొక సమయంలో ఐరన్ లెగ్ శాస్త్రిని పెట్టుకుంటే సినిమా హిట్‌ కాదు అనే ఒక రూమర్ స్టార్ట్ అయిందని ప్రసాద్ చెప్పుకొచ్చారు.అది కూడా కొంతమంది సినిమా వాళ్లే క్రియేట్ చేశారని ఆయన చెప్పారు.

దాంతో కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోయాయి.మరికొన్ని సినిమాలేమో హిట్ అవ్వలేదు.

అంతవరకూ వస్తున్న రూమర్స్ నిజమే అనుకొని, ఆయన వల్లే అలా జరిగిందని చాలా మంది అనుకున్నారని ప్రసాద్ అన్నారు.బంధువులు కూడా ఏమైనా ఫంక్షన్‌ అయినా కూడా పిలవడం ఆపేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయనొస్తే ఏమవుతుందో, ఆయనొస్తే మన పరిస్థితి ఏంటో అనే పరిస్థితికి వచ్చేశారు వాళ్లంతా అని ప్రసాద్ వాపోయారు.అలా కావడంతో నాన్న మైండ్‌సెట్ చాలా డిస్టర్బ్ అయిందన్న ప్రసాద్, ఒక్కోసారి ఇంటి అద్దె కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారని ఆయన తెలిపారు.

ఇలా అయ్యేసరికి సినిమాలకు ఎవరూ పిలిచేవారు కాదు.ఒకవేళ పిలిచినా డబ్బులిచ్చేవారు కాదు.కానీ ఏ రోజూ ఆ బాధను ఎవరికీ చెప్పుకునేవారు కాదని, ఆయనలో ఆయనే బాధ పడేవారని ఆయన కుమారుడు ప్రసాద్ తెలిపారు.అలా జరిగిన కొన్ని రోజులకే తమ స్వగ్రామమైన తాడేపల్లిగూడెంకి వెళ్లిపోయామని ఆయన అన్నారు.

ఆయన సినిమాల ద్వారా ఏం సంపాదించలేదని ఏ సినిమాకూ ఇంత కావాలని డిమాండ్ చేయలేదని, ఎంతిస్తే అంత తీసుకునే వారని ప్రసాద్ వివరించారు.

Telugu Iron Leg Shastri, Iron Leg Shastri Son, Remuneration, Tollywood-Movie

అప్పట్లో ఐరన్ లెగ్ శాస్త్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేశారన్న ప్రసాద్, ఆయనకు రెమ్యునరేషన్‌గా రోజుకు 3 నుంచి 4 వేలు ఇచ్చేవారని ఆయన తెలిపారు.ఇప్పుడైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ కి దాదాపు 50వేల వరకు ఇస్తున్నారని ప్రసాద్ అన్నారు.

ఇకపోతే 2006 నుంచి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధ పడ్డాడు.

జూన్ 19, 2006లో తన స్వస్థలం తాడేపల్లి గూడెంలో మరణించాడు.చివరి రోజుల్లో ఆయనకు పచ్చ కామెర్లు కూడా సోకింది.

చనిపోయే ముంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు.ఆయన కుటుంబ సభ్యులు తమను ఆర్థికంగా ఆదుకోమని ప్రభుత్వాన్ని అర్థించారు.

వారి కుటుంబ పరిస్థితిని గమనించిన సంపూర్ణేష్ బాబు 25000 రూపాయలు సహాయం చేశారు.మరో నటుడు సందీప్ కిషన్‌ కూడా కొంత ఆర్థిక సాయం అందజేసినట్టు తెలుస్తోంది.

#Iron Shastri #Iron Shastri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు