విశాఖపట్నంలోని రిషికొండ తవ్వకాలతో పాటు భవన నిర్మాణాలపై దాఖలైన పిల్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ బృందం డిసెంబర్ మొదటి వారంలో పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తరువాత నివేదికను సమర్పిస్తామని ఆయన వెల్లడించారు.దీంతో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 27వ తేదీకి వాయిదా వేసింది.