స్టార్ యాక్టర్ కమల్ హాసన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

స్టార్ యాక్టర్ కమల్ హాసన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తొలి సినిమాకే కమల్ హాసన్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కిందంటే కమల్ హాసన్ ఏ స్థాయి నటుడో సులభంగా అర్థమవుతుంది.

 Interesting Facts About Star Actor Kamal Hassan , 2014 Year , Interesting Facts,-TeluguStop.com

బాలనటుడిగా సినిమాల్లో కెరీర్ ను మొదలుపెట్టిన కమల్ హాసన్ కు మూడుసార్లు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది.శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి దంపతులకు నాలుగో కొడుకైన కమల్ మూడున్నర సంవత్సరాల వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

కలత్తూర్ కన్నమ్మ కమల్ హాసన్ నటించిన తొలి సినిమా.కమల్ హాసన్ చిన్న వయస్సులోనే డ్యాన్స్ కొరియోగ్రఫర్ గా కూడా పని చేశారు.కొన్ని సినిమాలకు కమల్ పాటల రచయితగా కూడా పని చేయడం గమనార్హం.తమిళ సినిమా రంగంలో కమల్ హాసన్ తిరుగులేని నటుడిగా ఎదిగారు.

కమల్ హాసన్ కొరియోగ్రఫీ చేసిన కాశీ యాత్ర, అన్నై వెలంకని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

1990 సంవత్సరంలో కమల్ హాసన్ కు పద్మశ్రీ రాగా 2014 సంవత్సరంలో కమల్ హాసన్ కు పద్మ భూషణ్ అవార్డు వచ్చింది.

కమల్ హాసన్ అద్భుత నటనకు 4 నేషనల్ అవార్డులతో పాటు 19 ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి.కమల్ హాసన్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ఆ సేవా కార్యక్రమాల ద్వారా గొప్పదనాన్ని చాటుకున్నారు.

రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు పుస్తకాల పంపిణీ, ఐ డొనేషన్ డ్రైవ్, ఇతర కార్యక్రమాలను కమల్ హాసన్ చేశారు.

Telugu Kamal Hassan-Movie

రాజకీయాల్లో కూడా సత్తా చాటాలని కమల్ హాసన్ భావించినా రాజకీయాలలో మాత్రం కమల్ ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయారు.2018 సంవత్సరంలో కమల్ హాసన్ మక్కల్ నీది మయం పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేసినా ఆ పార్టీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube