ఎరుపే కాదు ప‌సుపు రంగు పుచ్చ‌కాయ‌లు తిన్నా మ‌స్తు బెనిఫిట్స్‌!

పుచ్చ‌కాయ అంటే అంద‌రికీ ట‌క్కున ఎరుపు రంగు గుజ్జు ఉన్న‌వి గుర్తుకు వ‌స్తాయి.కానీ, ప‌సుపు రంగులో ఉండేవి కూడా ఉంటాయి.

వీటిని ఎక్క‌డో విదేశాల్లో కాదు.మ‌న దేశంలోనే పండిస్తున్నారు రైతులు.

ఇప్పుడిప్పుడే అన్ని మార్కెట్ల‌లోకి ఇవి అందు బాటులోకి వ‌స్తున్నాయి.వీటిని చూస్తే రంగు ఏమైనా వేశారా.? అన్న అనుమానం రాక మాన‌దు.అయితే నిజానికి ఈ పుచ్చకాయల్లో లైకోపీన్‌ అనే పదార్థం ఉండదు.

అందు వ‌ల్ల‌నే ఎరుపు రంగులో కాకుండా ప‌సుపు రంగులో ఉంటాయి.ఇక ప‌సుపు రంగులో ఉన్న‌ప్ప‌టికీ.

Advertisement

ఈ పుచ్చ‌కాయ‌ల్లో పోష‌కాల‌కు ఎటు వంటి ఢోకా లేదు.పైగా ఎరుపు పుచ్చ కంటే ప‌సుపు పుచ్చ‌కాయ‌ల‌తోనే అత్య‌ధిక ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.

మ‌రి ఆల‌స్య‌మెందుకు ప‌సుపు రంగులో ఉండే పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు ఏంటో చూసేయండి.ఎరుపు ప‌చ్చ‌కాయ‌ల్లో కంటే ప‌సుపు ప‌చ్చ‌కాయ‌ల్లోనే బీటా కెరోటిన్ ఎక్కువ‌గా ఉంటుంది.

అందు వ‌ల్ల ప‌సుపు పుచ్చ‌కాయ‌ను డైట్‌లో చేర్చుకుంటే అందులో ఉండే బీటా కెరోటిన్ ఓ యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌ని చేసి శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా అడ్డు క‌ట్ట వేస్తుంది.అలాగే ప‌సుపు పుచ్చ‌కాయ‌ల్లో పుష్క‌లంగా ఉండే విట‌మిన్ సి.రోగ నిరోధ‌కశ‌క్తిని పెంచి వివిధ ర‌కాల జ‌బ్బుల‌ను ద‌రి చేయ‌కుండా కాపాడుతుంది.చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేస్తాయి.

అంతేకాదు, ప‌సుపు పుచ్చ‌కాయ‌ల‌ను తీసుకుంటే కంటి చూపు మెరుగు ప‌డుతుంది.ఇత‌ర కంటి సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి.శ‌రీరం డీహైడ్రేట్ అవ్వ‌కుండా ఉంటుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

Advertisement

జుట్టు రాల‌డం త‌గ్గి బ‌లంగా పెరుగుతుంది.కిడ్నీలో రాళ్లు క‌రిగి పోతాయి.

మ‌రియు మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తాజా వార్తలు