భారతీయ మహిళా పైలట్‌కు అమెరికాలో అరుదైన గౌరవం.. ఎవరీ జోయా అగర్వాల్..?

భారత సంతతికి చెందిన బోయింగ్ 777 సీనియర్ పైలట్ అయిన కెప్టెన్ జోయా అగర్వాల్.ఉత్తర ధృవం మీదుగా విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

 Indian Woman Pilot Gets Place In Aviation Museum In America, Captain , Zoya Ag-TeluguStop.com

దాదాపు 16,000 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించిన జోయాకు అరుదైన గౌరవం దక్కింది.ఎస్ఎఫ్ఓ ఏవియేషన్ మ్యూజియంలో స్థానాన్ని దక్కించుకున్నారు.2021లో జోయా అగర్వాల్ నేతృత్వంలో ఎయిరిండియాకు చెందిన ఆల్ విమెన్ పైలట్ బృందం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి భారత్‌లోని బెంగళూరు నగరానికి విమానాన్ని నడిపారు.ఈ సమయంలో ఉత్తర ధృవాన్ని కవర్ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన విమాన మార్గం గుండా ప్రయాణించారు.

అమెరికా కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఏవియేషన్ మ్యూజియం ఎయిరిండియా మహిళా పైలట్లందరి విజయాన్ని చూసి ముచ్చటపడింది.దీనిలో భాగంగానే వీరికి తమ మ్యూజియంలో చోటు కల్పించారు నిర్వాహకులు.

ఈ సందర్భంగా జాతీయ వార్తాసంస్థ ఏఎన్ఐతో జోయా అగర్వాల్ మాట్లాడుతూ… శాన్‌ఫ్రాన్సిస్కో‌లోని లూయిస్ ఎ టర్పెన్ ఏవియేషన్ మ్యూజియంలో పైలట్‌గా చోటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తినని చెప్పారు.దీనిని సాధారణంగా ఎస్ఎఫ్ఓ ఏవియేషన్ మ్యూజియం అని పిలుస్తారని జోయా తెలిపారు.

అమెరికాలోని ప్రతిష్టాత్మక ఏవియేషన్ మ్యూజియంలో తాను భాగమన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని కెప్టెన్ జోయా అగర్వాల్ పేర్కొన్నారు.విమానయాన రంగంలో జోయా అగర్వాల్ సాధించిన విజయం.మహిళా సాధికారతను ప్రోత్సహిస్తుందన్నారు.లక్షలాది మంది బాలికలు, యువత వారి కలల్ని నెరవేర్చుకునేందుకు జోయా ప్రేరణగా నిలిచారని ఎస్ఎఫ్ఓ ప్రశంసించింది.

Telugu America, Museum, Indian, Pilot, San Francisco, Pilots India, Zoya Aggarwa

ఇకపోతే.కెప్టెన్ జోయా అగర్వాల్ ఐక్యరాజ్యసమితిలో లింగ సమానత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.స్త్రీలు, యువత తమ కలల్ని నెరవేర్చుకోవడాన్ని ప్రోత్సహించడంలో ఆమె మార్గదర్శిగా నిలుస్తున్నారు.అటు 1980లో శాన్‌ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఎస్ఎఫ్ఓ)లో ఈ మ్యూజియం ప్రారంభించారు.నాటి నుంచి ఇక్కడి ఐదు టెర్మినల్స్‌లోని గ్యాలరీలతో డైనమిక్ ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్‌గా అభివృద్ధి చెందింది.ఇక్కడ ఎస్ఎఫ్ఓతో పాటు వాణిజ్య విమానయాన చరిత్రకు సంబంధించి 1,50,000కు పైగా వివిధ వస్తువులు వున్నాయి.

మరోవైపు.భారత్‌లో మహిళా పైలట్ల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది.

ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ వుమెన్ ఎయిర్‌లైన్స్ ప్రకారం.ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మహిళా పైలట్లను కలిగివున్న దేశం ఇండియానే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube