బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
సల్మాన్ ఖాన్ కు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.సల్మాన్ ఖాన్ ని ఆయన అభిమానులు కండల వీరుడు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు.
కాగా సల్మాన్ ఖాన్ మొదట సూరజ్ బర్జత్య దర్శకత్వంలో మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తరువాత హమ్ ఆప్కే హై కౌన్,కరణ్ అర్జున్, బీవీ నెం.1లాంటి సినిమాలలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు సల్మాన్ ఖాన్.అంతేకాకుండా తొమ్మిదేళ్లపాటు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలను అందించిన ఏకైక హీరో సల్మాన్ ఖాన్.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా కొన్నిసార్లు ఈ స్టార్ హీరో బాయ్ అనేక విషయాలలో ట్రోలింగ్స్ చేసారు.అలాగే ఇతర హీరోల మాదిరిగానే సల్మాన్ కూడా హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు కూడా వినిపించాయి.
కాగా ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ పై అతని మాజీ ప్రేయసి శాడిస్ట్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.పూర్తి వివరాల్లోకి వెళితే.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సల్మాన్ ఖాన్ గురించి అతనితో డేటింగ్ చేసిన మాజీ ప్రేయసి సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు చేసింది.నాతో పాటుగా ఇతర మహిళలను కూడా సల్మాన్ ఖాన్ కొట్టేవాడు.అతని గురించి గొప్పగా చెప్పడం మానేయండి.అతను ఒక శాడిస్ట్ అంటూ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి చేసిన వాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.
కాగా గతంలో కూడా ఐశ్వర్యరాయ్ ని సల్మాన్ ఖాన్ కొట్టినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.