డ్రగ్స్ దందాతో అక్రమ సంపాదన.. యూకేలో భారత సంతతి వ్యక్తి గుట్టురట్టు

మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాతో పాటు మనీలాండరింగ్( Money Laundering ) నేరాలకు పాల్పడిన భారత సంతతి వ్యక్తికి యూకే కోర్ట్( UK Court ) ఎనిమిదేళ్ల జైలు శిక్షవిధించింది.ఈ మేరకు యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్‌సీఏ) తెలిపింది.

 Indian Origin Man Jailed For Over 8 Years For Drug Trafficking Money Laundering-TeluguStop.com

నిందితుడిని ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని సర్రేకు చెందిన రాజ్ సింగ్ (45)గా( Raj Singh ) గుర్తించారు.ఇతను వకాస్ ఇక్బాల్‌ (41)తో( Waqas Iqbal ) కలిసి ఏ క్లాస్ డ్రగ్స్, తుపాకీలను కొనుగోలు చేయడానికి, వాటిని విక్రయించడానికి కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

అంతేకాదు.ఇలా సంపాదించిన డబ్బును అక్రమ మార్గాల ద్వారా కెనడాకు పంపాలని కూడా ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

క్లాస్ ఏ (కొకైన్), క్లాస్ బీ (కెటామైన్)ను సరఫరా చేసేందుకు తాము కుట్ర చేసినట్లు , ఇదే సమయంలో మనీలాండరింగ్ నేరాలకు పాల్పడినట్లు గిల్డ్‌ఫోర్డ్ క్రౌన్ కోర్ట్ ముందు సింగ్ అంగీకరించాడు.దీనితో పాటు మరో ఘటనలో పోలీసులపై దాడి చేసినట్లు కూడా ఒప్పుకున్నాడు.

దీంతో న్యాయస్థానం రాజ్ సింగ్‌కు ఎనిమిదేళ్ల 10 నెలల జైలు శిక్ష, ఇక్బాల్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.మహిళా పోలీస్ అధికారిపై భౌతిక దాడికి గాను రాజ్‌సింగ్‌కు మరో 12 నెలల జైలు శిక్ష కూడా విధించింది కోర్ట్.

ఒక పబ్‌లో జరిగిన ఘర్షణలో సింగ్ పాల్గొనగా.అతనిని అడ్డకోవడానికి మహిళా పోలీస్ ప్రయత్నించగా.ఆమెను కాలుతో తన్నాడు.

Telugu Canada, Drug, Indianorigin, Raj Singh, Rajindersingh, Uk, Waqas Iqbal-Tel

ఎన్‌సీఏ పరిశోధనల ప్రకారం.క్లాస్ ఏ ఔషధాలను కొనుగోలు చేయడానికి, సరఫరా చేయడానికి వీరిద్దరూ పలు డీల్స్ కుదుర్చుకున్నారు.ఏప్రిల్ 2020లో ఇక్బాల్ 3,85,000 పౌండ్ల క్రెడిట్‌పై తీసుకున్న డ్రగ్స్‌కు డబ్బును తిరిగి చెల్లించే క్రమంలో వీరి నేరాలు వెలుగుచూశాయి.

అదే ఏడాది మార్చి , మే నెలల మధ్య వీరిద్దరూ కొకైన్, హెరాయిన్‌లను భారీగా సమకూర్చుకుని.కెటమైన్‌ను కెనడాకు పంపాలని ప్లాన్ చేశారు.

Telugu Canada, Drug, Indianorigin, Raj Singh, Rajindersingh, Uk, Waqas Iqbal-Tel

వీటితో పాటు 2020 మార్చి చివరిలో లండన్‌లోని ఈ17 అకాసియా రోడ్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ఇక్బాల్ మందుగుండు సామాగ్రిని సరఫరా చేశాడు.ఇది జరిగిన ఒక వారం తర్వాత నిందితులిద్దరూ దాచిపెట్టిన తుపాకీ గురించి చర్చించుకున్నారు.ఏప్రిల్ 8, 10 తేదీలలో వీరిద్దరూ 8,000 పౌండ్లకు ఎన్‌క్రో‌చాట్‌లో పరిచయాల ద్వారా తుపాకీ కొనుగోలు గురించి చర్చించారు.2020 ఏప్రిల్, మే మధ్య నెదర్లాండ్స్‌కు 1,51,500 యూరోలను లాండరింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube