మార్కెట్లో పాపులర్ అవుతున్న బ్లూటూత్ మౌస్.. ధర వెయ్యిలోపే, ఫీచర్స్‌ మాత్రం అదుర్స్!

ఈ రోజుల్లో టెక్ యాక్సెసరీలు వైర్‌లెస్‌గా మారుతున్నాయి.ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ ప్యాడ్, కీబోర్డ్, హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్ ఇలా ప్రతిదీ బ్లూటూత్ సాయంతో వైర్‌లెస్‌గా వర్క్ అవుతున్నాయి.

 Asus Marshmallow Md100 Bluetooth Mouse Price Specifications,mouse, Bluetooth Mou-TeluguStop.com

వీటి వల్ల చిక్కుముడులు పడే వైర్ల సమస్య తప్పింది.ఇక కంప్యూటర్ యాక్సెసరీలలో అత్యంత ముఖ్యమైన మౌస్‌లు కూడా వైర్‌లెస్‌గా అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే ఇటీవల కాలంలో రిలీజ్ అయిన ఆసుస్ మార్ష్‌మల్లౌ మౌస్ MD100 బాగా పాపులర్ అయ్యింది.ఇది ఒక బ్లూటూత్ మౌస్‌.

ఇది చాలా తేలికైనది, కాంపాక్ట్‌గా ఉంటుంది.

వినియోగదారులు దీన్ని సులభంగా నచ్చిన చోటుకు తీసుకువెళ్లవచ్చు.ఇది ఫ్లాట్-ఇష్ డిజైన్‌ను కలిగి ఉంది.మిస్ట్ పర్పుల్, బ్రేవ్ గ్రీన్ అనే రెండు షేడ్స్‌లో తొలగించగల మాగ్నెటిక్ కవర్‌తో వస్తుంది.

కవర్లు స్మడ్జ్‌లను దూరంగా ఉంచే మాట్టే ఫినిష్ కలిగి ఉంటాయి.మౌస్‌ను ఆసుస్ యాంటీమైక్రోబయల్ గార్డ్‌తో ఇన్ఫెక్ట్ అవ్వదు.

అంతేకాదు అది బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది.

మౌస్ దాదాపు అన్ని ఉపరితలాలపై అద్భుతంగా పని చేస్తుంది.ఇందుకు 100% PTFE మౌస్ బాటమ్‌ ఉపయోగపడుతుంది.మౌస్‌లో మూడు బటన్లు ఉంటాయి.

ఒక బటన్ లెఫ్ట్ క్లిక్, ఒక బటన్ రైట్ క్లిక్, మరో బటన్ స్క్రోల్ వీల్‌గా పని చేస్తాయి.వినియోగదారులు 800, 1000, 1600 dpi సెన్సిటివిటీల మధ్య నచ్చినదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

ఇది విండోస్, MacOS, క్రోమ్‌బుక్, ఆండ్రాయిడ్ టాబ్లెట్లు, ఐపాడ్‌లకి సపోర్ట్ చేస్తుంది.డాంగిల్‌ని ఉపయోగించి వైర్‌లెస్ RF 2.4 GHzతో కూడా ఉపయోగించవచ్చు.ఒకే AA బ్యాటరీతో మౌస్ బ్యాటరీ లైఫ్ దాదాపు ఒక సంవత్సరం వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube