ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతోంది.ఈ సీజన్ లో జలుబు, దగ్గు, ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర సమస్యలు తీవ్రంగా మదన పెడుతుంటాయి.
అలాగే చలి పులి కారణంగా కీళ్ల నొప్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి.అయితే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడంలో ఇప్పుడు చెప్పబోయే గోల్డెన్ వాటర్ అద్భుతంగా సహాయపడుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ వాటర్ ను తాగితే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం మేలు చేసే ఆ వాటర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హిట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కనీసం పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ గోల్డెన్ వాటర్ ను చలికాలంలో ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి.ఇలా చేస్తే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆస్తమా తదితర సీజనల్ వ్యాధులు దూరం అవుతాయి.
అంతేకాదు ఈ గోల్డెన్ వాటర్ ను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు తొలిగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.ఒత్తిడి, చిరాకు దూరం అవుతాయి.మెదడు సూపర్ యాక్టివ్ గా మారుతుంది.
అంతేకాదండోయ్ ఈ గోల్డెన్ వాటర్ ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుండి విముక్తి లభిస్తుంది.చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.
గుండె పోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా సైతం ఉంటాయి.