పాటలేమో సూపర్ హిట్.. సినిమాలేమో డిజాస్టర్.. భారీ అంచనాలతో విడుదలై ఫ్లాపైన సినిమాలు ఇవే!

ప్రతి సినిమాకు పాటలు( Songs ) ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పాటలు హిట్టైతే సినిమా హిట్ గా నిలుస్తుందని చాలామంది భావిస్తారు.

 Hit Songs Flop Movies Orange Arya 2 Komaram Puli Radhe Shyam Details,hit Songs F-TeluguStop.com

అయితే కొన్ని సినిమాలు మాత్రం పాటల విషయంలో మెప్పించినా కథ, కథనం విషయంలో మెప్పించలేక ఫ్లాప్ అయ్యాయి.చరణ్ సినిమాలలో ఒకటైన ఆరెంజ్ సినిమాలోని( Orange Movie ) పాటలు ప్రేక్షకులను ఊహించని స్థాయిలో మెప్పించడం గమనార్హం.

హరీష్ జైరాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని ప్రతి పాట హిట్టైనా ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ సాధించకపోవడం గమనార్హం.పవన్ ఎస్.జె.సూర్య కాంబోలో ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించిన కొమరం పులి సినిమా( Komaram Puli ) సైతం ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది.కొమరం పులి సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు.

Telugu Arya, Dear Comrade, Flop, Khaleja, Komaram Puli, Nenokkadine, Orange, Pan

ఆర్య 2( Arya 2 ) సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ కాగా ఈ సినిమా కమర్షియల్ గా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించే విషయంలో ఫెయిలైంది.పౌర్ణమి, రాధేశ్యామ్, ఊసరవెల్లి, సర్దార్ గబ్బర్ సింగ్, నా ఆటోగ్రాఫ్, డియర్ కామ్రేడ్ సినిమాలు సైతం పాటలు హిట్టై భారీ అంచనాలతో విడుదలైనా ఈ సినిమాలు సైతం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించే విషయంలో ఫెయిలయ్యాయి.

Telugu Arya, Dear Comrade, Flop, Khaleja, Komaram Puli, Nenokkadine, Orange, Pan

అజ్ఞాతవాసి( Agnyaathavaasi Movie ) పాటలు ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించలేదు.ఖలేజా, 1 నేనొక్కడినే, ఇద్దరమ్మాయిలతో, పంజా, కృష్ణార్జున యుద్ధం, ఆగడు సినిమాలు సైతం ఈ జాబితాలో నిలిచాయి.మరికొన్ని సినిమాలు మాత్రం సాంగ్స్ అద్భుతంగా ఉండటం వల్ల హిట్టైన సందర్భాలు సైతం ఉన్నాయి.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు 5 కోట్ల రుపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా బీజీఎం విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నారు.కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రం తమ రెమ్యునరేషన్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube