ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) ఈడీ అరెస్ట్ మరియు కస్టడీపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు( Delhi High Court )లో విచారణ జరగనుంది.ఈ మేరకు లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పు( ED Arrest )ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ పిటిషన్ లో ఆరోపించారు.ఈడీ కస్టడీ చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తనను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ లో కోరారు.మరోవైపు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది.
ఛార్జ్ షీట్ అంశాలపై కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తుంది.కాగా రేపటితో కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియనుంది.