మెగా డాటర్ నిహారిక( Niharika )ప్రస్తుతం కెరియర్ పరంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె ఇటీవల ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.
ప్రస్తుతం ఈమె నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే.పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్( Pink Elephant Pictures ) అనే బ్యానర్స్ స్థాపించి నిర్మాతగా వెబ్ సిరీస్ , సినిమాలను కూడా నిర్మిస్తూ ఉన్నారు.

ఇక ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను నిర్మించినటువంటి నిహారిక మొదటిసారి ఓ సినిమాకు నిర్మాతగా మారారు.ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ నిహారిక తెలియజేశారు.ఈ సినిమా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈమె వెల్లడించారు.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్నటువంటి ఈ సినిమాకు కమిటీ కుర్రాళ్ళు ( Comity Kurraallu ) అనే టైటిల్ పెట్టినట్టు నిహారిక వెల్లడించారు.

త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అధికారికంగా వెల్లడించబోతున్నట్లు ఈమె తెలిపారు.అంతేకాకుండా ఈ సినిమా ద్వారా నిహారిక ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్తవారిని పరిచయం చేయబోతున్నారని తెలుస్తుంది.ముఖ్యంగా ఈ సినిమాలో 11 మంది కొత్తవాళ్లు హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అలాగే నలుగురు హీరోయిన్లు కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని నిహారిక వెల్లడించారు.ఇలా కొత్త వారితో నిహారిక నిర్మాతగా ఓ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు అంటే ఇది నిజంగానే ఒక సాహసం అనే చెప్పాలి.
ఇక నిహారిక కూడా తెలుగు సినిమాలతో పాటు మలయాళ సినిమాలను కూడా చేస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీ అయ్యారు.
.






